నాన్నకు సినిమా నచ్చకపోతే అలా చేస్తారు!
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాకి పాజిటివ్ బజ్ తీసుకొచ్చింది.
By: Tupaki Desk | 8 Oct 2024 7:14 AM GMTయంగ్ హీరో సుధీర్ బాబు స్టోరీ విషయంలో రూట్ మార్చిన సంగతి తెలిసిందే. డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకుల్ని అలరించాలని ట్రై చేస్తున్నాడు. కానీ తాను అనుకున్న రిజల్ట్ మాత్రం ఇంకా రావడం లేద. ప్రస్తుతం ఫాదర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో 'మా నాన్న సూపర్ హీరో` అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాకి పాజిటివ్ బజ్ తీసుకొచ్చింది. టీజర్ చూసి కొంత మంది హీరోలు ప్రశంసించారు.
నేచురల్ స్టార్ నాని కూడా టీజర్ కి మంచి మార్కులు వేసాడు. అలాగే సూపర్ స్టార్ మహేష్ సైతం మెచ్చిన టీజర్ గా నిలిచింది. ఇక సినిమా ఈనెల 11న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు తన తండ్రితో సినిమాల పరంగా ఉన్న బాండింగ్ ని రివీల్ చేసారు. ` మా నాన్న కఠినంగా ఉండరు. అలాగని ఓ స్నేహితుడులా కూడా ఉండరు. ఆయన ఎప్పుడూ కోపగించుకోరు. నన్ను కొట్టింది కూడా లేదు. తను చాలా క్రమశిక్షణ గల మనిషి.
ఆయన క్రమ శిక్షణే చిన్ననాటి నుంచి నాలో, మా అక్కలో స్పూర్తి ని నింపింది. మీరు ఇలా ఉండా? అలా ఉండాలి? అని ఎప్పుడూ చెప్పలేదు. నాన్న నా సినిమాల గురించి పెద్దగా మాట్లాడరు. అది బాగుంది..ఇది బాలేదని కూడా ఎప్పుడూ చెప్పరు. కానీ నా సినిమాలు ఎవైనా ఆయనకు నచ్చితే మాత్రం నాకు తెలిసిపోతుంది. వాళ్ల మిత్రులు ఎవరైనా నాన్నకు మెసెజ్ పెడితే అది నాకు పార్వార్డ్ చేస్తారు. లేదంటే థియేటర్ల వద్ద సినిమా టాక్ గురించి మాట్లాడుతుంటే? ఆ వీడియోలు షేర్ చేస్తుంటారు.
అలా వచ్చింది అంటే నాన్నకు సినిమా నచ్చిందని అర్దం. ఎలాంటి మెసెజ్ గానీ, వీడియో గానీ రాలేదు అంటే నాన్నకు ఆ సినిమా నచ్చలేదని మనమే అర్దం చేసుకోవాలి. అర్జున్ రెడ్డిలో నాన్న మీద ఉన్న ప్రేమని హీరో అగ్రెసివ్ గా చూపిస్తాడు. అందులో హీరో పాత్ర లార్జర్ దెన్ లైఫ్ లా ఉంటుంది. అది జనాలకు కనెక్ట్ అయింది. మా చిత్రంలో నాన్న మీద ప్రేమను ప్రేమతోనూ చూపించాం. అది హృదయాలకు హత్తుకునేలా ఉంటుంది` అని అన్నారు.