ఆ లేడీ డైరెక్టర్ భారీ మల్టీస్టారర్..విలన్ గా హీరోలే!
అయితే ఇది విలన్ రోలా? లేక మరో కీలకమైన పాత్ర అన్నది క్లారిటీ రావాలి. మరికొంత మంది విశాల్ నో చెప్పిన పాత్రకే జయం రవి ఎస్ చెప్పాడని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ స్పందించాలి.
By: Tupaki Desk | 21 Nov 2024 7:30 AM GMTశివ కార్తికేయన్ ఇటీవలే 'అమరన్' తో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. శివ కార్తికేయన్ కెరీర్ లో తొలిసారి భారీ వసూళ్లు సాధించిన చిత్రమిది. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద మరో మైలు రాయిలా నిలిచింది. ఈ నేపథ్యంలో శివకార్తికేయన్ తో లేడీ సంచలనం సుధ కొంగర ఓ భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. 'పురాణనూరు' అనే ఓ సోషియో పొలికటిల్ థ్రిల్లర్ కథని సిద్దం చేసారు.
ఇప్పటికే శివ కార్తికేయన్కి జోడీగా శ్రీలీలను హీరోయిన్ గానూ ఎంపిక చేసారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే స్టోరీ డిమాండ్ మేరకు ఇందులో మరో ఇద్దరు హీరోలు కూడా నటిస్తున్నారు. తొలుత ఇందులో విలన్ పాత్ర కోసం విశాల్ ని తీసుకోవాలనుకున్నారు. కానీ అదంతా ప్రచారమని కొద్ది సేపటి క్రితమే క్లారిటీ ఇచ్చాడు. ఇదంతా తప్పుడు ప్రచారమని...తనని విలన్ గా చూడాలనుకుంటున్న వారిని కొంత కాలం పాటు శాంతించి ఉండాలని కోరారు.
చేతిలో భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నట్లు తెలిపాడు. అయితే మరో పాత్రకు తమిళ హీరో జయ రవిని తీసుకున్న ట్లు..అతడు అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది విలన్ రో లా? లేక మరో కీలకమైన పాత్ర అన్నది క్లారిటీ రావాలి. మరికొంత మంది విశాల్ నో చెప్పిన పాత్రకే జయం రవి ఎస్ చెప్పాడని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ స్పందించాలి. మరో ముఖ్యమైన పాత్ర కోసం యంగ్ హీరో అధర్వని లాక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అలాగే మలయాళ నటుడు రోషన్ మాథ్యూ కూడా సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. మరి సినిమాలో ఎంత మంది నటిస్తున్నారు? అన్నది క్లారిటీ రావాలంటే మేకర్స్ స్పందించాలి. ఈ సినిమా వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సుధ కొంగర ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.