రైటర్ నుంచి డైరెక్టర్ గా సుధా జర్నీ!
మొదట ద్రోహి అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన సుధాకు ఆ తర్వాత మాధవన్ తో చేసిన ఇరుదై సుత్రు కు మంచి ఫేమ్ వచ్చింది.
By: Tupaki Desk | 7 March 2025 7:00 PM ISTఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ సుధా కొంగర గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సూరరై పొట్రు సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ అందుకున్న సుధా కొంగర మొదట రైటర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు పని చేసింది. మణిరత్నం దగ్గర పలు సినిమాలకు సుధా పని చేసింది. రైటర్ గా మంచి అనుభవం వచ్చాకే సుధా కొంగర డైరెక్టర్ గా ప్రయత్నించింది.
మొదట ద్రోహి అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన సుధాకు ఆ తర్వాత మాధవన్ తో చేసిన ఇరుదై సుత్రు కు మంచి ఫేమ్ వచ్చింది. ఆ సినిమానే తెలుగులో గురుగా రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత సూర్యతో చేసిన సూరరై పొట్రు సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో స్పెషల్ గా చెప్పే పన్లేదు. సూరరై పొట్రు సినిమా ఎన్నో అవార్డులు సైతం సొంతం చేసుకుంది.
ప్రస్తుతం శివ కార్తికేయన్ తో పరాశక్తి సినిమాను చేస్తున్న సుధా కొంగర రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేసి మంచి రెస్పాన్స్ అందుకుంది. వాస్తవానికి ఆ సినిమాను సుధ కొంగర సూర్యతో చేయాల్సింది. సూరరై పొట్రు తర్వాత సూర్య, సుధ కలిసి మరో సినిమా చేద్దామనుకుని ఈ కథను రెడీ కూడా చేసుకున్నారు. కానీ ఎందుకో సడెన్ గా సూర్య తో సినిమా క్యాన్సిలై శివ కార్తికేయన్ ట్రాక్ లోకి వచ్చాడు.
కోలీవుడ్ లో సెటిలైనప్పటికీ సుధా కొంగర తెలుమ్మాయనే విషయం చాలా మందికి తెలియదు. సుధా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో పుట్టింది. సుధా తండ్రి ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి కాగా, ఆమె తల్లి చెన్నైకి చెందిన వారు. ఆంధ్రలో పుట్టినప్పటికీ సుధా పెరిగిందంతా మొత్తం చెన్నైలోనే. ప్రస్తుతం సుధా కొంగర శివ కార్తికేయన్ తో చేస్తున్న పరాశక్తిపై అందరికీ భారీ అంచనాలున్నాయి.