దసరా నిర్మాతతో బాలయ్య సెట్టా..?
ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ హీరోగా ఒక సినిమా అనౌన్స్ చేశారు. అసలైతే లాస్ట్ డిసెంబర్ లోనే ఆ సినిమా పూజా కార్యక్రమాలు జరగాల్సింది కానీ ఎందుకో ఆగిపోయింది
By: Tupaki Desk | 6 Feb 2025 8:30 PM GMTనాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన దసరా సినిమా నిర్మించిన సుధాకర్ చెరుకూరి అంతకుముందు చేసిన సినిమాలన్నీ నిరాశపరచగా దసరాతో ఆయన ఫస్ట్ టైం సక్సెస్ రుచి చూశారు. ఇప్పుడు ఆ కాంబోనే రిపీట్ చేస్తూ మరో సినిమా చేస్తున్న సుధాకర్ చెరుకూరి నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ తొలి సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ హీరోగా ఒక సినిమా అనౌన్స్ చేశారు. అసలైతే లాస్ట్ డిసెంబర్ లోనే ఆ సినిమా పూజా కార్యక్రమాలు జరగాల్సింది కానీ ఎందుకో ఆగిపోయింది.
ఐతే ప్రశాంత్ వర్మ కమిటైన సినిమాలు చాలా ఉన్నా అందుకే మోక్షజ్ఞతో చేసే సినిమా కాస్త లేట్ అయ్యేలా ఉంది. ఐతే మోక్షజ్ఞ తో సినిమా అనుకున్న అతను ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేస్తాడని టాక్. రీసెంట్ గా బాలయ్యకు పద్మభూషణ్ అవార్డ్ రావడంతో నారా భువనేశ్వరి ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఆయన బాలకృష్ణతోనే సినిమా ఉంటుందన్నట్టు చెప్పుకొచ్చాడు.
మోక్షజ్ఞ తో అనుకున్న కాంబినేషన్ కాస్త బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబో సినిమాకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది. గోపీచంద్ మలినేనితో బాలయ్య ఇప్పటికే వీర సింహా రెడ్డి సినిమా చేశాడు. ఆ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అనిపించుకుంది. మరోసారి గోపీచంద్ మలినేని తో సినిమా చేసేందుకు బాలయ్య ఓకే అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమా పనుల్లో ఉన్న గోపీచంద్ మలినేని త్వరలోనే బాలకృష్ణతో సినిమా లైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
మోక్షజ్ఞ సినిమా నిర్మించాలని అనుకున్న సుధాకర్ చెరుకూరి ఆ సినిమా లేట్ అవుతుందని తెలిసి ఇప్పుడు బాలకృష్ణ సినిమాను నిర్మించాలని ఫిక్స్ అయ్యారట. ఓ పక్క నాని పారడైజ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మరోపక్క బాలకృష్ణ తో కూడా సుధాకర్ చెరుకూరి సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు నిర్మాతగా సుధాకర్ చెరుకూరికి భారీ క్రేజ్ తెస్తాయని చెప్పొచ్చు.