Begin typing your search above and press return to search.

రూ.300 కోట్లతో రిస్క్‌ వద్దనుకున్నారా..!?

సినిమా ప్రకటన వచ్చి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయక పోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   5 July 2024 12:30 PM GMT
రూ.300 కోట్లతో రిస్క్‌ వద్దనుకున్నారా..!?
X

తమిళ స్టార్‌ హీరో సూర్య త్వరలో కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదల అవ్వాల్సిన కంగువ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. కంగువాతో సంబంధం లేకుండా ఆకాశమే నీ హద్దురా సినిమా దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో సూర్య ఒక సినిమాకు ఓకే చెప్పాడు.

సూర్య, సుధ కొంగర కాంబో కి మంచి క్రేజ్‌ ఉంది, వీరిద్దరు కలిసి సినిమా చేస్తే ఖచ్చితంగా మరో జాతీయ అవార్డు రావడం ఖాయం అంటూ నెటిజన్స్ తో పాటు మీడియా సర్కిల్స్ లో కూడా ప్రచారం జరిగింది. సినిమా ప్రకటన వచ్చి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయక పోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ఇటీవల దర్శకురాలు సుధ కొంగర ఒక చిట్ చాట్ లో సూర్య తో సినిమా విషయమై ప్రస్తుతానికి ఏం చెప్పలేక పోతున్నాను అన్నట్టుగా వ్యాఖ్యలు చేసింది. సుధ కొంగర సినిమా కి డేట్లు ఇవ్వకుండా కొత్త సినిమాను సూర్య ప్రారంభించడం కూడా చర్చనీయాంశం అయ్యింది.

ఇంతకు సూర్య తో సుధ కొంగర చేయాల్సిన సినిమా కు ఏం అయ్యిందనే ప్రశ్నలకు తమిళ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాధానం ప్రకారం... 1965 లో జరిగిన హిందీ భాష వ్యతిరేక ఉద్యమం ఆధారంగా ఈ సినిమాను రూపొందించాలి అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం వల్ల సినిమా విడుదల సమయంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయట.

రూ.300 కోట్ల బడ్జెట్‌ తో తీయాలి అనుకున్న ఈ సినిమా విడుదల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటే చాలా పెద్ద రిస్క్ అవుతుంది. అందుకే నిర్మాత మరియు హీరో కూడా ఈ ప్రాజెక్ట్‌ విషయమై ఆలోచనల్లో పడ్డారు అనేది టాక్‌. అంత బడ్జెట్‌ పెట్టి రిస్క్ తీసుకోవాలని ఎవరు అనుకుంటారు అన్నట్లుగా కొందరు తమిళ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. రాబోయే కాలంలో కూడా వీరి కాంబో మూవీ ఉండక పోవచ్చు అనేది తమిళ మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం.