Begin typing your search above and press return to search.

సూపర్ హీరో.. సోలో ప్రమోషన్స్..!

ఘట్టమనేని ఫ్యామిలీ హీరో సుధీర్ బాబు చేస్తున్న ప్రతి సినిమాకు అతను ఎంతో ఎఫర్ట్స్ పెడుతున్నట్టు అనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   29 Sep 2024 10:19 AM GMT
సూపర్ హీరో.. సోలో ప్రమోషన్స్..!
X

ఘట్టమనేని ఫ్యామిలీ హీరో సుధీర్ బాబు చేస్తున్న ప్రతి సినిమాకు అతను ఎంతో ఎఫర్ట్స్ పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఐతే ఇప్పటికి కూడా సుధీర్ బాబు స్టామినా ప్రూవ్ చేసే సినిమా రాలేదని చెప్పొచు. హరోంహర కాస్త బెటర్ అనిపించినా ఎందుకో ఆ సినిమాను ఆడియన్స్ పట్టించుకోలేదు. ఐతే లేటెస్ట్ గా సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో సినిమా చేస్తున్నారు. అక్టోబర్ 11న సినిమా రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాకు సుధీర్ బాబు సోలో ప్రమోషన్స్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

మా నాన్న సూపర్ హీరో సినిమా టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఇక సినిమా నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్ కాగా ఆ సాంగ్ ను ప్రమోట్ చేస్తూ తన పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో వదిలాడు సుధీర్ బాబు. వేడుకలో సాంగ్ విన్న ప్రతిసారి తనకు ఇదే గుర్తొస్తుందని కామెంట్ పెట్టాడు. వేడుకలో సాంగ్ తో మీ పెళ్లి వీడియోని జత చేసి మాకు పంపించండి అని ఒక కాంటెస్ట్ పెట్టాడు. సుధీర్ బాబు పెళ్లి వీడియోలో మహేష్ వింటేజ్ లుక్ అదిరిపోయింది. యంగ్ లుక్ లో మహేష్ ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం సినిమాను ఆడియన్స్ కు రీచ్ అవ్వాలంటే ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేయాల్సిందే. అందుకే ఘట్టమనేని ఫ్యామిలీ హీరో అయినా సుధీర్ బాబు తన సినిమాను తానే భుజాన వేసుకుని ప్రమోట్ చేస్తుంటాడు. మహేష్ ని హెల్ప్ అడిగితే చేస్తాడు కానీ సుధీర్ బాబు ఆ విషయంలో కూడా మొహమాట పడుతున్నాడని అనిపిస్తుంది.

సుధీర్ బాబు మా నాన్న హీరో ఈసారి ఎమోషనల్ టచ్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాడు. మరి సుధీర్ బాబు సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. సుధీర్ బాబు మా నాన్న హీరో సినిమాను అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేశారు. దసరా కానుకగా సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టయన్ వస్తుంది. ఆ సినిమాకు మా నాన్న సూపర్ హీరో పోటీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. సుధీర్ బాబు మాత్రం ఈసారి తన సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి దసరాకి సుధీర్ బాబు మ్యాజిక్ వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.