హీరో నవుతానంటే నాన్న గుండె ముక్కలైంది!
ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్లి నటుడవుతానంటే? ప్రోత్సహించే వారికన్నా భయపెట్టి వెనక్కి లాగే వారే ఎక్కువగా ఉంటారు.
By: Tupaki Desk | 13 Sep 2024 5:11 AM GMTఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్లి నటుడవుతానంటే? ప్రోత్సహించే వారికన్నా భయపెట్టి వెనక్కి లాగే వారే ఎక్కువగా ఉంటారు. అందులో తల్లిదండ్రులైతే కొడుకు జీవితం ఏమైపోతుందోనన్న ఆందోళన కనిపిస్తుంది. అందుకే ఏ తల్లిదండ్రి అవన్నీ మనకెందుకు బాగా చదువుకున్నావ్ మంచి ఉద్యోగం చేసుకుని ప్రశాంతగా ఉండక? అని చెబుతారు. అలాగని తల్లిదండ్రులంతా అలా ఉంటారని అనుకోవడానికి లేదు.
పూరి జగన్నాధ్ తల్లిదండ్రులు కూడా అలా అనుకుంటే? అతడు ఇండస్ట్రీని ఏలేవాడా? అంత మంది హీరోలను తీర్చి దిద్దేవాడా? లెజెండరీ నటుడు అమితాబచ్చన్ ని డైరెక్ట్ చేయగలిగేవారా? కొన్ని కొన్ని ధర్మం ప్రకారం అలా జరిగిపోతాయంటే? తాజాగా హీరో సుధీర్ బాబు కూడా తన మనోగతాన్ని చెప్పే ప్రయత్నం చేసాడు. ఆయన హీరోగా నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ ప్రచార కార్యక్రమంలో భాగంగా తండ్రితో ఎదురైన కొన్ని సంఘటనలు గురించి రివీల్ చేసారు.
తండ్రి -కొడుకుల అనుబంధాన్ని ఆధారంగా చేసుకుని సినిమా కావడంతో వ్యక్తిగతంగానూ సుధీర్ బాబుకి సినిమా కనెక్ట్ అయింది. `సినీ పరిశ్రమకు నేను వెళ్తానని చెప్పినప్పుడు మా నాన్న గుండె ముక్కలయింది. అదృష్టవశాత్తు ఇండస్ట్రీలో ఓ స్థానం దక్కించుకోగలిగాను. అందుకు నాన్న హ్యాపీగా ఉన్నారు. అలా జరగకపోతే పరిస్థితి మరోలా ఉండేదేమో. నాకు తండ్రిపై ఎంతో ప్రేమ ఉన్నా ఎప్పుడూ `ఐ లవ్ యూ` అని చెప్పలేదు.
దగ్గరకు తీసుకుని హత్తుకుంది కూడా లేదు. ఆయనను ఆలింగనం చేసుకోవాలని ఇప్పటికీ అనిపి స్తుంటుంది. కానీ చేసుకోలేను. అందుకే మా అబ్బాయిలను హగ్ చేసుకుంటుంటా. మానాన్న గారి నుంచి కష్టపడేతత్వ నాకు అలవరింది. ఆయన ఎంతో కష్టపడతారు. నిరంతరం పని ధ్యాసతోనే ఉంటారు` అని అన్నారు.