సుధీర్ బాబు 'జటాధర' క్లాప్ కొట్టారోచ్..!
ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తుండగా జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కె.ఆర్.బన్సాల్, ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు.
By: Tupaki Desk | 15 Feb 2025 2:29 PM GMTనవ దళపతి సుధీర్ బాబు హీరోగా కొత్త సినిమా పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. ఈసారి జటాధర అంటూ సూపర్ న్యాచురల్ మైథలాజికల్ జోనర్ లో ఈ సినిమా చేస్తున్నాడు సుధీర్ బాబు. ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తుండగా జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కె.ఆర్.బన్సాల్, ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు.
జటాధర పూజా కార్యక్రమాలకు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అటెండ్ అయ్యారు. ఆయనతో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్, డైరెక్టర్ వెంకీ అట్లూరి, మోహనకృష్ణ ఇంద్రగంటి, శిల్పా శిరోద్కర్ లు గెస్ట్ గా వచ్చారు. జటాధర ముహూర్తం షాట్ కి స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ క్లాప్ కొట్టారు.
సుధీర్ బాబు జటాధర కథ అనంత పద్మనాభ స్వామి ఆలయం నేపథ్యంతో తెరకెక్కుతుందని తెలుస్తుంది. పద్మనాభ స్వామి సంపద దాని చుట్టూ అల్లుకున్న వివాదాల నేపథ్యం ఇంకా ఆలయ చరిత్ర ఈ సినిమాలో ప్రధాన అంశాలుగా ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. జటాధర సినిమా కోసం సుధీర్ బాబు తన లుక్ ని కూడా మార్చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం తన బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ చేసుకుంటున్నాడని తెలుస్తుంది.
జటాధర నిజంగానే ఒక మంచి అటెంప్ట్ అని చెప్పొచ్చు. వెంకట్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేసి కథ రాసుకున్నట్టు తెలుస్తుంది. ఎలాగు ఇలాంటి డివోషనల్ సబ్జెక్ట్ లకు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ ఉంది కాబట్టి ఈ జటాధర కూడా నేషనల్ లెవెల్ లో సూపర్ బజ్ ఏర్పరచుకుంటుందని చెప్పొచ్చు. జటాధర తో సుధీర్ బాబు పాన్ ఇండియా అటెంప్ట్ చేయబోతున్నాడు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
సుధీర్ బాబు సినిమాల్లో తన బెస్ట్ ఇచ్చేస్తున్నాడు కానీ కథ ఇంకా దర్శకుల తప్పిదం వల్ల టార్గెట్ మిస్ అవుతున్నాయి. ఐతే జటాధర మాత్రం అటు కథ పరంగా అదిరిపోతుందని తెలుస్తుండగా డైరెక్టర్ విజువల్ పరంగా సూపర్ ట్రీట్ అందించడానికి రెడీగా ఉన్నాడని తెలుస్తుంది. జటాధర తో సుధీర్ బాబు నేషనల్ లెవెల్ లో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. త్వరలో రెగ్యులర్ షూట్ కి వెళ్లనున్న ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ తర్వాత వస్తాయి.