సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో'.. ఇకనైనా..
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు.. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకుని సినీ ప్రియులను అలరిస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 14 Oct 2024 8:23 AM GMTటాలీవుడ్ హీరో సుధీర్ బాబు.. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకుని సినీ ప్రియులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. మూవీకి మూవీకి తనలోని కొత్త టాలెంట్ ను బయట పెట్టి రానిస్తున్నారు. కొద్దిరోజులుగా యాక్షన్ సినిమాలతో సందడి చేస్తున్న ఆయన.. రీసెంట్ గా ఎమోషనల్ ఎంటర్టైనర్ మా నాన్న సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
యంగ్ డైరెక్టర్ అభిలాష్ కంకర దర్శకత్వం వహించిన మా నాన్న సూపర్ హీరో మూవీ.. దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయింది. సినిమాలో సుధీర్ బాబుతో పాటు సీనియర్ నటులు షాయాజీ షిండే, సాయిచంద్ కీలక పాత్రలు పోషించారు. కన్న తండ్రి, దత్తత తీసుకున్న తండ్రి.. వీరిద్దరి మధ్య ఓ కొడుకు ప్రయాణం ఎలా సాగిందనే పాయింట్ తో అభిలాష్ కంకర.. సినిమాను తెరకెక్కించారు.
అయితే మా నాన్న సూపర్ హీరో మూవీలో ప్రజెంట్ జనరేషన్ కోరుకునే న్యూ కంటెంట్ ఉందనే చెప్పాలి. మనసుల్ని హత్తుకునే ఓ భావోద్వేగ భరితమైన మూవీ అని, మంచి ఎమోషనల్ కంటెంట్ తో రూపొందిన సినిమా అని నెటిజన్లు చెబుతున్నారు. సినిమా అంతా ఎక్కడా గాడి తప్పకుండా నిజాయితీగా నడిపించే ప్రయత్నం డైరెక్టర్ చేశారని కొనియాడుతున్నారు. ప్రీ- క్లైమాక్స్ లో డబ్బు కోసం జరిగే చిన్నపోరు ఆసక్తికకరంగా ఉందని అంటున్నారు.
ముఖ్యంగా హీరో సుధీర్ బాబు.. సెటిల్ట్ గా మెప్పించారని చెబుతున్నారు. నాన్నను హీరోలా భావించే కుర్రాడిగా.. తండ్రి ప్రేమను దక్కించుకునేందుకు తపన పడే బిడ్డగా నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారని అంటున్నారు. క్లైమాక్స్ సీన్స్ లో ఆయన ఎమోషనల్ యాక్టింగ్ హత్తుకుంటుందని అంటున్నారు. ఓవరాల్ గా కొత్త కంటెంట్ తో ఉన్న మూవీ అని కొనియాడుతున్నారు. దసరాకు వచ్చిన సినిమాల్లో మా నాన్న సూపర్ హీరో మూవీ తమను మెప్పించిందని అనేక మంది విమర్శకులు కూడా చెబుతున్నారు.
అయితే మంచి కంటెంట్ తో తెరకెక్కిన మూవీ అయినా.. మా నాన్న సూపర్ హీరో ఆడియన్స్ ను సరిగ్గా రీచ్ అవ్వలేదని చెప్పాలి. వసూళ్లు కూడా అనుకున్నంత స్థాయిలో రాలేదు. అందుకు కారణాలు ఏమైనా... సినిమా మాత్రం మస్ట్ వాచ్ బుల్ అని కొందరు నెటిజన్లు సజ్జెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడు సినీ ప్రియులకు మెల్లగా ఎక్కుతుందని, సోమవారం నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.