Begin typing your search above and press return to search.

ఆ కటౌట్ కి తగ్గ సినిమా పడితే మాత్రం..?

ఇక తన హార్డ్ వల్ల పర్ఫెక్ట్ బాడీ షేప్ ఏర్పరచుకున్న సుధీర్ బాబు కొన్ని సక్సెస్ ఫుల్ సినిమాలతో కెరీర్ కొనసాగిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   16 Jun 2024 1:22 PM GMT
ఆ కటౌట్ కి తగ్గ సినిమా పడితే మాత్రం..?
X

హీరోగా కెరీర్ మొదలు పెట్టి పుష్కర కాలం అవుతున్నా ఘట్టమనేని అల్లుడు యువ హీరో సుధీర్ బాబుకి సెపరేట్ స్టార్ క్రేజ్ రాలేదని మాత్రం చెప్పొచ్చు. ఏమాయ చేసావె సినిమాలో సమంత బ్రదర్ రోల్ చేసిన సుధీర్ బాబు 2012లో వచ్చిన ఎస్.ఎం.ఎస్ సినిమాతో హీరోగా మొదటి సినిమా చేశాడు. మొదట్లో తన వాయిస్ పరంగా కాస్త నెగిటివిటీ అందుకున్న సుధీర్ బాబు ఆ తర్వాత ఓవర్ కం చేశాడు. ఇక తన హార్డ్ వల్ల పర్ఫెక్ట్ బాడీ షేప్ ఏర్పరచుకున్న సుధీర్ బాబు కొన్ని సక్సెస్ ఫుల్ సినిమాలతో కెరీర్ కొనసాగిస్తున్నాడు.

సుధీర్ బాబు కెరీర్ లో సాలిడ్ హిట్ పడితే మాత్రం అతని కెరీర్ టర్న్ అవుతుందని చెప్పొచ్చు. అలాంటి సినిమా కోసమే ఘట్టమనేని ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఐతే సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ హరోం హర కొంతమేరకు ఆ ఇంపాక్ట్ కలిగేలా చేసిందని చెప్పొచ్చు. ఒక సినిమా అనుభవం ఉన్న జ్ఞాన సాగర్ ద్వారక సుధీర్ బాబు తో తీసిన హరోం హర మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది.

సినిమాలో కొన్ని యాక్షన్ బ్లాగ్స్ అందులో సుధీర్ బాబు లుక్ ఇవన్నీ ఒక పర్ఫెక్ట్ మాస్ హీరో లక్షణాలను తెలియచేస్తున్నాయి. హరోం హరతో తను ఏదైతే జరుగుతుందని సుధీర్ బాబు ఊహించాడో అది జరిగినట్టే అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా చూసిన ఆడియన్స్ సుధీర్ బాబు కటౌట్ కి ఒక మంచి కథ పడితే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అనుకుంటున్నారు.

ఘట్టమనేని ఫ్యామిలీ హీరోగా తన ఓన్ ఎఫర్ట్స్ తో కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడు సుధీర్ బాబు. సుధీర్ బాబు స్టార్ అయ్యే రోజు కోసం మహేష్ బాబు కూడా ఎదురుచూస్తున్నాడు. హరోం హర చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఇక నుంచి సుధీర్ బాబు ట్రాక్ లోకి వచ్చేస్తాడని ఫిక్స్ అయ్యారు. మరి సుధీర్ బాబుని స్టార్ చేసే సినిమా ఏది అవుతుందో చూడాలి. ఆ సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సుధీర్ బాబు కూడా ఇప్పుడిప్పుడే స్క్రీన్ పై తన మ్యాజిక్ చేస్తూ ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. ఇదే ఊపులో ఒకటి రెండు సినిమాలు వస్తే ఆడియన్స్ అతని టాలెంట్ గుర్తించే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా నెక్స్ట్ స్టార్ హీరోల లిస్ట్ లో సుధీర్ బాబు ఉండేలా తన ఎఫర్ట్స్ ఉన్నాయని చెప్పొచ్చు.