Begin typing your search above and press return to search.

సుధీర్ బాబు జటాధర.. పాన్ ఇండియా రేంజ్ లోనే..

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ మూవీతో సిద్ధమవుతున్నాడు.

By:  Tupaki Desk   |   17 Aug 2024 9:14 AM GMT
సుధీర్ బాబు జటాధర.. పాన్ ఇండియా రేంజ్ లోనే..
X

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ మూవీతో సిద్ధమవుతున్నాడు. తన లుక్స్ ఫిట్నెస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సుధీర్, ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కబోతున్న జటాధర అనే చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయబోతున్నాడు. ఈ సినిమాతో సుధీర్ బాబు సూపర్‌ నేచురల్‌ ఫాంటసీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు.


ప్రసిద్ధ నిర్మాత ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్ తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగులోనే కాకుండా హిందీ భాషలో కూడా రూపొందనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల కాగా, అది సోషల్ మీడియాలో మంచి హల్ చల్ చేసింది. సుధీర్ బాబు త్రిశూలం పట్టుకొని, లార్డ్ శివా ఛాయాచిత్రం ముందు శరీర సౌష్టవం ప్రదర్శిస్తూ ఉన్న లుక్ అద్భుతంగా ఆకట్టుకుంటోంది. ఈ లుక్ చూసిన అభిమానులు మరింత అంచనాలు పెంచుకుంటున్నారు.

జటాధర సినిమాను ఒక సాధారణ చిత్రం కాకుండా, తెలుగు సినీ పరిశ్రమతో పాటు బాలీవుడ్‌లో కూడా ఒక పెద్ద విజయాన్ని సాధించేలా రూపొందిస్తున్నారు. ఈ సినిమా సుప్రీం స్టార్ హోదాలో సుధీర్ బాబుకు ప్రత్యేక గుర్తింపునిస్తుంది అని అంటున్నారు. అలాగే, బాలీవుడ్‌ నుంచి ఒక ప్రముఖ హీరోయిన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో ప్రతినాయక పాత్రను ఒక A లిస్టర్ హీరో చేయనున్నట్లు సమాచారం.

ఈ విషయం తెలియగానే, అభిమానుల్లో ఉన్న ఆసక్తి మరింత పెరిగింది. సుధీర్ బాబు సాలిడ్‌ ప్రెజెన్స్‌, స్టార్ కాస్ట్‌ కాంబినేషన్‌ తో ఈ ప్రాజెక్ట్‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా నిర్మాత ప్రేరణ అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె గతంలో "రుస్తమ్," "టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ," "ప్యాడ్ మాన్," "పరి" వంటి చిత్రాలను నిర్మించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

ఇప్పుడు జటాధర తో ఆమె మరింతగా ప్రేక్షకులను అలరించబోతున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. హైదరాబాదులోని ప్రధాన లొకేషన్లలో చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే మున్జియా, స్ట్రీ, కాంతారా వంటి సంచలన చిత్రాలు ఇండియన్ సెన్సేషన్ గా నిలిచాయి. ఇప్పుడు జటాధర ఆ స్థాయిని మించి డిఫరెంట్ కంటెంట్‌ తో ప్రేక్షకులను కట్టిపడేయడానికి వస్తోంది. ఈ సినిమాను 2025 మహాశివరాత్రి సందర్భంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.