Begin typing your search above and press return to search.

సుధీర్ బాబు ఇకపై 'యువ దళపతి'...!

సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీ సపోర్ట్‌ సుధీర్ బాబు ఎంట్రీకి ఉపయోగపడింది. అయితే ఇండస్ట్రీలో గుర్తింపు మాత్రం సొంతంగానే తెచ్చుకున్నాడు.

By:  Tupaki Desk   |   30 May 2024 10:17 AM GMT
సుధీర్ బాబు ఇకపై యువ దళపతి...!
X

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరో సుధీర్ బాబు. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు మరియు ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీ సపోర్ట్‌ సుధీర్ బాబు ఎంట్రీకి ఉపయోగపడింది. అయితే ఇండస్ట్రీలో గుర్తింపు మాత్రం సొంతంగానే తెచ్చుకున్నాడు.

సక్సెస్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సుధీర్ బాబు రెగ్యులర్ గా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన హరోం హర సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. రేపు విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల జూన్ 14 కి వాయిదా పడింది.

ఇప్పటి వరకు సుధీర్‌ బాబును ఫ్యాన్స్‌ నైట్రో స్టార్‌ అంటూ పిలుచుకుంటూ ఉన్నారు. ఆయన నటించిన సినిమాల్లో కూడా నైట్రో స్టార్‌ సుధీర్ బాబు అంటూ టైటిల్‌ కార్డ్స్ వేయడం జరిగింది. కానీ హరోం హర సినిమాలో మాత్రం సుధీర్‌ బాబు పేరుకు ముందు 'యువ దళపతి' అనే బిరుదు వేయబోతున్నారు.

ఇక పై సుధీర్ బాబును యువ దళపతి ట్యాగ్‌ తో పిలవాలని ఫ్యాన్స్ నిర్ణయించుకున్నారు. సినిమా టైటిల్‌ కార్డ్స్ లో కూడా అదే ట్యాగ్‌ ను ఉపయోగించబోతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ ను ఆయన ఫ్యాన్స్ దళపతి అంటారు. ఇప్పుడు యువ దళపతి అంటూ సుధీర్ బాబుకు ఫ్యాన్స్‌ పేరు పెట్టారు.

జ్ఞనసాగర్‌ దర్శకత్వంలో రూపొందిన హరోం హర సినిమా ప్రమోషన్ లో భాగంగా సుధీర్‌ బాబు మాట్లాడుతున్న మాటలు చాలా అంచనాలు పెంచుతున్నారు. ముఖ్యంగా సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుంది అనే నమ్మకంను ప్రేక్షకుల్లో సుధీర్ బాబు కలిగించాడు. మరి యువ దళపతి సుధీర్‌ బాబుకు హిట్‌ దక్కేనా చూడాలి.