Begin typing your search above and press return to search.

అర్ష‌ద్ వార్సీ వ్యాఖ్య‌ల‌పై సుదీర్ బాబు కౌంట‌ర్!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ని ఉద్దేశించి బాలీవుడ్ న‌టుడు అర్ష‌ద్ వార్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Aug 2024 6:53 AM GMT
అర్ష‌ద్ వార్సీ వ్యాఖ్య‌ల‌పై సుదీర్ బాబు కౌంట‌ర్!
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ని ఉద్దేశించి బాలీవుడ్ న‌టుడు అర్ష‌ద్ వార్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. క‌ల్కిలో ప్ర‌భాస్ పాత్ర‌ని ఉద్దేశించి అదొక జోక‌ర్ రోల్ అని...ప్ర‌భాస్ త‌న‌కి జోక‌ర్ లా క‌నిపించాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. దీంతో ప్ర‌భాస్ అభిమానులు ఒక్క‌సారిగా భ‌గ్గుమన్నారు. టాలీవుడ్ నుంచి ప‌లువురు సెల‌బ్రిటీలు ఇప్ప‌టికే స్పందించారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా యంగ్ హీరో సుధీర్ బాబు కూడా వార్సీ వ్యాఖ్య‌ల‌పై కౌంట‌ర్ వేసాడు. `నిర్మాణాత్మ కంగా విమ‌ర్శించినా ప‌ర్వాలేదు. కానీ ఇలా త‌ప్పుగా మాట్లాడ‌వ‌ద్దు. వార్సీలో వృత్తినైపుణ్యం లోపించింది. ప్ర‌భాస్ స్థాయి చాలా పెద్ద‌ది. అలాంటి వ్యాఖ్య‌లు చేసి ఉండ‌కూడ‌దు` అని అన్నారు. ప్ర‌భాస్ కి మ‌ద్ద‌తుగా ఇప్ప‌టికే నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్, సాయికుమార్ ఎస్ కె.ఎన్ నిలిచారు.

అర్ష‌ద్ వార్సీ వ్యాఖ్య‌ల్ని ఖండించి త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. అయితే ఇది స‌రిపోదు. ఇంకా టాలీవుడ్ నుంచి చాలా మంది స్పందించాల్సి ఉంది. అర్ష‌ద్ వార్సీ ఈ వ్యాఖ్య‌లు చేసి కొన్ని గంట‌ల‌వుతుంది. కొంత‌మందే స్పందించారు. చెప్పాల‌నుకున్న వాళ్లంతా ఓపెన్ గా త‌మ అభిప్రాయాల్ని ఎక్స్ వేదిక‌గా పంచుకున్నారు.

అయితే వార్సీ వ్యాఖ్య‌ల‌పై ఇంకా ప్ర‌భాస్ గానీ, అత‌ని కుటుంబ స‌భ్యులుగానీ స్పందించ‌లేదు. అలాగే ఇండ‌స్ట్రీలో ఆయ‌న స‌న్నిహితులు కూడా ఎలాంటి రిప్లై ఇవ్వ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ మ‌ళ్లీ షూట్ లో బిజీ అయ్యే ప‌నిలో ఉన్నారు. ఇటీవలే హ‌నురాఘ‌వ‌పూడితో `పౌజీ` చిత్రాన్ని ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే. అలాగే మారుతితో `రాజాసాబ్` షూట్ ని పూర్తి చేయాల్సి ఉంది.