Begin typing your search above and press return to search.

యూట్యూబ‌ర్‌కి ఛాన్సిచ్చినందుకు హీరో క్ష‌మాప‌ణ‌లు

కానీ అందుకు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించిన స‌ద‌రు యూట్యూబ్ వ్యాఖ్యాత కం న‌టుడు ఇప్పుడు తీవ్రంగా చిక్కుల్లో ప‌డ్డాడు.

By:  Tupaki Desk   |   8 July 2024 5:19 PM GMT
యూట్యూబ‌ర్‌కి ఛాన్సిచ్చినందుకు హీరో క్ష‌మాప‌ణ‌లు
X

ఒక‌రికి అవ‌కాశం క‌ల్పించిన‌ప్పుడు అత‌డు దానిని స‌ద్వినియోగం చేసుకోవాలి. అవ‌కాశం క‌ల్పించిన వ్య‌క్తుల గౌరవాన్ని పెంచాలి. అలా చేస్తేనే ఈ రంగంలో చిర‌కాలం అవ‌కాశాలుంటాయి. కానీ అందుకు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించిన స‌ద‌రు యూట్యూబ్ వ్యాఖ్యాత కం న‌టుడు ఇప్పుడు తీవ్రంగా చిక్కుల్లో ప‌డ్డాడు.

తండ్రి కూతుళ్ల సంబంధం గురించి ఎగ‌తాళి చేసిన యూట్యూబ‌ర్ ప్ర‌ణీత్ హ‌నుమంతు టాలీవుడ్ లో తీవ్ర నిర‌శ‌న‌ను ఎదుర్కొంటున్నాడు. ప‌లువురు తెలుగు హీరోలు ఇప్ప‌టికే అత‌డి ఉద్ధేశాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఇప్పుడు ఈ జాబితాలో మ‌రొక హీరో చేరారు. ఇటీవలే సుధీర్ బాబు 'హరోమ్ హర'లో ప్ర‌ణీత్ హ‌నుమంతుకు అవ‌కాశం క‌ల్పించారు. ఆ ఇద్ద‌రూ క‌లిసి నటించాడు. కానీ ఇప్పుడు సుధీర్ బాబు X ఖాతాలో అత‌డి ఎంపిక గురించి అస‌హ్యించుకుంటున్నాన‌ని తెలిపాడు. అలాంటి వాడిని ఈ మూవీలో పాత్ర కోసం ఎంపిక చేసినందుకు ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పాడు.

''మంచి లేదా చెడు .. నేను సోషల్ మీడియా వ్యక్తిని కాదు.. మాధ్య‌మాల‌లో కొన‌సాగ‌లేను. ప్రణీత్ హనుమంతుకి #హరోమ్‌హారలో నటించే అవ‌కాశం క‌ల్పించినందుకు నేను చాలా అసహ్యంగా భావిస్తున్నాను. నా మొత్తం బృందం నుండి హృదయపూర్వక క్షమాపణలు. ఈ మనిషి ఎంత దయనీయమైన జీవి అనేది మాకు తెలియదు. అది నాకు నిజంగా తెలియలేదు'' అని సుధీర్ బాబు రాశారు. అతడు షేర్ చేసిన ఆ వీడియో మొత్తం చూసేందుకు కూడా నేను ధైర్యం చేయలేనని సుధీర్ బాబు అన్నారు. ఈ అనారోగ్యం మనస్సులు వారు వ్యాప్తి చేయాలనుకుంటున్న కల్మషానికి వేదిక ఉండకూడదని మనం నిర్ధారించుకోవాలి. ఇది ఏ విధంగానూ వాక్ స్వాతంత్య్రం కాదు'' అంటూ ఎమోష‌న‌ల్ గా స్పందించారు. ప్ర‌ణీత్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మంచు మ‌నోజ్, సాయిధ‌ర‌మ్ త‌దిత‌రులు ఖండించారు.