డెడికేషన్ తో డైరెక్టర్‌కే విసుగు పుట్టించిన నటి!
సెట్లో హీరోయిన్లకు చుక్కులు చూపించిన దర్శకులెంతో మంది ఉంటారు.
By: Tupaki Desk | 10 Sep 2024 7:30 PM GMTసెట్లో హీరోయిన్లకు చుక్కులు చూపించిన దర్శకులెంతో మంది ఉంటారు. సీన్ సరిగ్గా చేయకపోతే టేక్ ల మీద టేక్ లు తీసుకుని సమయం వృద్ధా చేస్తుంటారు. ఈ సమయంలో దర్శకుడు సహనాన్ని పరీక్షిస్తుం టారు. దర్శకుడు అంతే సహనంతో పనిచేయాలి. లేదా? సీరియస్ అవుతూ పనిచేయించుకోవాలి. ఇండస్ట్రీలో రెండో రకం దర్శకులే ఎక్కువగా ఉంటారు. సీన్ సరిగ్గా చేయకపోతే కొపగించుకునే దర్శకులే ఎక్కువ.
కొంతమంది అయితే చేయి కూడా చేసుకుంటారు. కానీ అలాంటి డైరెక్టర్లకే చుక్కలు చూపించింది కరీనా కపూర్. కట్ చెప్పకపోయినా సీన్ లో నటిస్తూనే ఉంది. అంతగా ఆ పాత్రలో కరీనా కపూర్ లీనమైందన్న సంగతి రివీల్ చేసాడు దర్శకడు సుధీర్ మిశ్రా. ఆయన దర్శకత్వలో కరీనా కపూర్ నటించిన `చమేలి` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో అమ్మడు వేశ్య పాత్రలో ఆకట్టుకుంది.
కెరీర్ లో మరో మెట్టు ఎక్కించిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఆ సినిమా సంగతులు సుధీర్ గుర్తు చేసుకు న్నాడు. `కరీనా ఎంతో ప్రతిభా వంతురాలు. దర్శకుడిని ఎలా గౌరవించాలో ఆమెకు తెలుసు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆమెకి ఓసీన్ ఇచ్చి కట్ చెప్పడం మర్చిపోయేవాడిని. కానీ ఆమె నటించడం మాత్రం ఆపేది కాదు. ఈ విషయం గురించి ఆమెకు చెబితే?.. దర్శకుడు కట్ చెప్పేంత వరకూ నటిస్తూనే ఉంటానని చెప్పేది.
అందుకే దర్శకులు మెచ్చిన నటి అయింది. సినిమా కోసం అవసరమయ్యే కొన్ని ప్రత్యేకమైన స్టిల్స్ కోసం ఎంతో ఒపికగా నిలబడేది. ఏమాత్రం విసుగు చెందేది కాదు. ఇంత ఓపిక ఏ నటిలోనూ చూడలేదు. ఇందులో చాలా సన్నివేశాలు వర్షంలో షూట్ చేసాం. వర్షం లో చీర బరువుగా ఉన్నా ఎంతో ఓపికతో నటించేది. దాదాపు 12 గంటల పాటు ఈ సినిమా షూటింగ్ కోసమే గడిపేది. అందువల్లే ఈ సినిమా షూటింగ్ 28 రోజుల్లో పూర్తి చేసాం` అన్నారు.