Begin typing your search above and press return to search.

సుధీర్ బ్యాక్ టు పెవిలియన్..?

సుడిగాలి సుధీర్ బుల్లితెరలో ఈ పేరు వింటే చాలు ఆడియన్స్ అంతా ఊగిపోతారు.

By:  Tupaki Desk   |   16 May 2024 6:24 AM GMT
సుధీర్ బ్యాక్ టు పెవిలియన్..?
X

సుడిగాలి సుధీర్ బుల్లితెరలో ఈ పేరు వింటే చాలు ఆడియన్స్ అంతా ఊగిపోతారు. స్మాల్ స్క్రీన్ పై ఈ రేంజ్ క్రేజ్ సంపాదించిన సుధీర్ సిల్వర్ స్క్రీన్ వైపు అడుగులు వేశాడు. జబర్దస్త్ తో మొదలై సిల్వర్ స్క్రీన్ పై హీరోగా టర్న్ అయిన సుధీర్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెర మీద అతను ఏ షో చేసినా సూపర్ హిట్ అవ్వాల్సిందే. అలాంటి సుధీర్ స్మాల్ స్క్రీన్ ని వదిలి వెండితెర మీద హీరోగా మారేందుకు ప్రయత్నాలు చేశాడు. సాఫ్ట్ వేర్ సుధీర్ తో హీరోగా మొదటి ప్రయత్నం చేసిన సుధీర్ ఆ తర్వాత వాంటెడ్ పండుగాడు, గాలోడు, కాలింగ్ సహస్ర అనే సినిమాలు చేశాడు.

బుల్లితెర మీద సుధీర్ షో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. కానీ సిల్వర్ స్క్రీన్ పై సుధీర్ సినిమాలు అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అతను సినిమాలు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వెళ్తున్నాయి అన్న విధంగా పరిస్థితి మారింది. హీరోగా రాణించడం అనేది అంత ఈజీ థింగ్ ఏమి కాదు. అయితే సిల్వర్ స్క్రీన్ పై తన ప్రయత్నాలు కొనసాగిస్తున్న సుధీర్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత మళ్లీ స్మాల్ స్క్రీన్ పై అడుగు పెడుతున్నాడు.

తనకు జబర్దస్త్ ఫ్లాట్ ఫాం ఇచ్చి ఈ రేంజ్ కి చేరుకునేలా అవకాశం ఇచ్చిన ఈటీవీ కోసం మళ్లీ స్మాల్ స్క్రీన్ లోకి వస్తున్నాడు సుధీర్. ఈటీవీలో త్వరలో మొదలవుతున్న ఫ్యామిలీ స్టార్స్ ప్రోగ్రాంకి సుధీర్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. లేటెస్ట్ గా దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. సుధీర్ ఆట చూస్తావా అంటూ గుంటూరు కారంలో సూపర్ స్టార్ డైలాగ్ తో అదరగొట్టేశాడు.

సుధీర్ స్మాల్ స్క్రీన్ ఎంట్రీ అతని ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. అయితే బుల్లితెరకు షిఫ్ట్ అయ్యాం కదా అని సినిమాలు వదిలేస్తాడేమో అనుకుంటే పొరబడినట్టే. సినిమాలు సినిమాలే స్మాల్ స్క్రీన్ షోలు షోలే అని ఫిక్స్ అయ్యాడట సుధీర్. హీరోగా సక్సెస్ అవ్వలేదు కాబట్టే సుధీర్ మళ్లీ బుల్లితెర మీదకు వచ్చాడని కొందరు అంటున్నా.. స్క్రీన్ ఏదైనా ఎంటర్టైన్ చేయడమే తన ముఖ్య ఉద్దేశం అని ఫిక్స్ అయ్యాడు సుధీర్. ఇంతకీ ఈ ఫ్యామిలీ స్టార్స్ షో కాన్సెప్ట్ ఏంటి.. సుధీర్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ హోస్టింగ్ తో ఎలా మెప్పిస్తాడన్నది చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.