షాకిస్తున్న స్టార్ కిడ్ మినీ హ్యాండ్ బ్యాగ్ ధర
సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ లతో పార్టీల్లో ప్రత్యక్షం కావడం కొత్తేమీ కాదు.
By: Tupaki Desk | 7 March 2025 7:00 AM ISTపార్టీ క్రౌడ్స్ లో చిల్ చేసేప్పుడు కళ్లన్నీ ఖరీదైన యాక్ససరీస్ బ్యాగులపైనే ఉంటాయి. ఖరీదైన వస్తువులతో నైట్ పార్టీల్లో చిల్లింగ్ సెలబ్రిటీ కిడ్స్ సందడి అంతా ఇంతా కాదు. ఎంపిక చేసుకున్న పొట్టి దుస్తులు యాక్సెసరీస్ తో పాటు హ్యాండ్ బ్యాగులను క్రౌడ్ పరిశీలనగా చూస్తారు. ఎవరు ఏ రేంజ్ బ్రాండ్ ఎంపిక చేసారు? అన్నది చర్చగా మారుతుంది. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ లతో పార్టీల్లో ప్రత్యక్షం కావడం కొత్తేమీ కాదు.
బుధవారం ముంబైలో తన ప్రాణ స్నేహితురాలు ఖుషీ కపూర్ - ఇబ్రహీం అలీ ఖాన్ నటించిన `నదానియన్` ప్రత్యేక షోకు జాన్వీ హాజరయ్యారు. ఈ ప్రివ్యూ షోలో స్టార్ కిడ్ సుహానా చాలా అందంగా కనిపించింది. అంతకుమించి తన మినీ హ్యాండ్‌బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రివ్యూలో సుహానా సాదా బ్లాక్ డ్రెస్ ధరించి మ్యాచింగ్ బెల్ట్‌తో క్లాసీగా కనిపించింది. ఎంపిక చేసుకున్న బ్రాస్‌లెట్, స్టడ్ డ్ చెవిపోగులు, వాచ్ ని ధరించింది. ముఖ్యంగా పార్టీలో హెర్మ్స్ మినీ కెల్లీ బ్యాగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది చూడటానికి చిన్న స్లింగ్ బ్యాగ్ లాగా కనిపిస్తున్నా.. ఖరీదు మాత్రం తాకితే కాల్తుంది. మినీ కెల్లీ బ్యాగ్ విలువ సుమారు రూ.22 లక్షలు ఉంటుందని అంచనా. ప్రీమియర్‌లో లక్షల విలువైన తన బ్యాగ్‌ను ప్రదర్శించి సుహానా అందరి దృష్టిని ఆకర్షించింది.
2023లో నెట్‌ఫ్లిక్స్ 'ది ఆర్చీస్' చిత్రంతో సుహానా, ఖుషి నటనా ఆరంగేట్రం చేసారు. ప్రసిద్ధ ఆర్చీ కామిక్స్ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి జోయా అక్తర్ దర్శకత్వం వహించారు. సైఫ్ అలీ ఖాన్ -అమృతా సింగ్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ `నదానియన్`తో నటుడిగా రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఈ చిత్రం 7 మార్చి 2025న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. నాదానియన్ ప్రివ్యూకు సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్, అర్హాన్ ఖాన్, సోనమ్ కపూర్ అహుజా తదితరులు కూడా హాజరయ్యారు.