చీరందంలో నే సుహానా కనికట్టు!
జాన్వీకపూర్..సారా అలీఖాన్..అనన్యా పాండే లాంటి బ్యూటీలకు పోటీగా తర్వాత తరం నటీమణులు మ్యాకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు.
By: Tupaki Desk | 13 Nov 2023 12:53 PM GMTబాలీవుడ్ లో స్టార్ కిడ్స్ ఎంట్రీతో వాతావరణం అంతకంతకు వెడెక్కుతోంది. ఒకర్ని మించిన అందం మరొకరు. జాన్వీకపూర్..సారా అలీఖాన్..అనన్యా పాండే లాంటి బ్యూటీలకు పోటీగా తర్వాత తరం నటీమణులు మ్యాకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ లిస్ట్ లో మోస్ట్ వాంటెండ్ భామగా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కనిపిస్తుంది. ఇప్పటికే `ది అర్చిస్` వెబ్ సిరీస్ తో లాంచింగ్ కన్పమ్ చేసింది.
అయితే అది ఓటీటీ సిరీస్ కావడంతో ఆ కిక్ సరిపోవడం లేదు. పెద్ద తెరకు ఎప్పుడు ఎక్కుతుందో? అప్పటి నుంచి వారసురాళ్ల మధ్య సిసలైన పోరు మొదలవుతుంది. ఈలోగా తాము? ఏంటన్నది ఇన్ స్టా వేదికగా చాటాలి. అందుకే సుహానా సంథిగ్ స్పెషల్ గా ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో దర్శనమిస్తుంది. పెద్ద తెరకు ముందే! అమ్మడు చిచ్చర పిడుగులా చెలరేగుతుంది. ఇప్పటికే డిజైనర్ దుస్తుల్లో సెగలు పుట్టించే భంగిమలతో ఇన్ స్టా ఫాలోవర్స్ ని పెంచుకుంది.
తాజాగా అమ్మడు పండగ సందర్భంగా సంప్రదాయ చీరందంలోనూ తళుకులీనింది. నిత్యం ఔట్ ఫిట్స్ లో కనిపించే సొగసరి ఒక్కసారిగా ట్రెడీషనల్ గాళ్ల్ గా ముస్తాబవ్వడం నెట్టింట చర్చకొస్తుంది. ఇదిగో ఇక్కడిలా సుహానా బ్రౌన్ కలర్ సారీ..మ్యాచింగ్ బ్లౌజులో ఆకర్షణీయంగా ముస్తాబైంది. ఎలాంటి యాక్సర సీస్ ధరించకుండా కేవలం చీర కట్టులోనే కనికట్టు చేస్తుంది. ఈ చీరని తానెంత ఇష్టపడుతుంతో ఓ కామెంట్ రూపంలో తెలియజేసింది. చీరని మించిన అందం ఇంకెక్కడ సొంతం అనే అర్దం వచ్చేలా కామెంట్ కనిపిస్తుంది.
అమ్మడు నటిస్తోనన్ `ది అర్చిస్` ప్రచార చిత్రాలు ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి. ఇందులో సుహానా ఎలాంటి పాత్రతో ఆకట్టుకుంటుందా? అని షారుక్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తండ్రీ-కుమార్తెని ఒకే ప్రేమ్ లోచూడాలని అంతే ఆసక్తి చూపుతున్నారు. మరి సొంత బ్యానర్ లో ఖాన్ సాబ్ ఎలాంటి సినిమాలు ప్లాన్ చేస్తాడో చూడాలి.