Begin typing your search above and press return to search.

స్టార్ కిడ్ అల్ట్రా గ్లామ‌ర‌స్ లుక్ వైర‌ల్!

సోష‌ల్ మీడియాల్లో సుహానాకు ఉన్న ఫాలోవ‌ర్లు నిరంత‌రం త‌న‌లోని ఎన‌ర్జీని పెంచుతూనే ఉన్నారు.

By:  Tupaki Desk   |   3 Dec 2024 2:45 AM GMT
స్టార్ కిడ్ అల్ట్రా గ్లామ‌ర‌స్ లుక్ వైర‌ల్!
X

కింగ్ ఖాన్ షారూఖ్ న‌ట‌వార‌సురాలు సుహానా ఖాన్ స్టైల్ గేమ్ నిరంత‌రం చ‌ర్చ‌గా మారుతోంది. బాలీవుడ్ లో ఇంకా న‌టిగా ప్ర‌వేశించ‌క ముందే భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. సోష‌ల్ మీడియాల్లో సుహానాకు ఉన్న ఫాలోవ‌ర్లు నిరంత‌రం త‌న‌లోని ఎన‌ర్జీని పెంచుతూనే ఉన్నారు. సుహానా ఫ్యాష‌న్ సెన్స్ గురించి యువ‌త‌రంలో ప్ర‌త్యేకంగా చ‌ర్చ సాగుతోంది.

త‌న మొద‌టి సినిమా విడుద‌ల కాక ముందే సుహానా నిరంత‌రం లైమ్ లైట్ లో ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ముఖ్యంగా త‌న ఫ్యాష‌న్ గేమ్ లో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌ద‌నాన్ని ప్రెజెంట్ చేస్తూ ఈ భామ హాట్ టాపిగ్గా మారుతోంది. ఇప్పుడు బ్లాక్ టాప్, బ్లూ జీన్స్‌లో అద్భుతంగా క‌నిపించింది ఈ బ్యూటీ.

ఈ ఆదివారం సుహానా త‌న త‌ల్లి గౌరీఖాన్.. సోద‌రుడు ఏబి రామ్ తో క‌లిసి డిన్న‌ర్ కి వెళ్లింది. ఆ స‌మ‌యంలో

సుహానా స్ట‌న్నింగ్ లుక్ తో కనిపించింది. తన మినిమల్ లుక్.. ఆకర్షణీయమైన మేకప్‌తో ప‌ర్ఫెక్ట్ ఫిట్ రూపంతో మైమ‌రిపించింది. బ్లాక్ టాప్ - బ్లూ జీన్స్‌లో సుహానా మనోహరంగా క‌నిపించింది. ఇది నేటిత‌రం కాలేజ్ విద్యార్థుల్లో జోష్ నింపే స్టైల్ అన‌డంలో సందేహం లేదు.

ఇంత‌కుముందు సుహానా ముంబైలో పాప్ స్టార్ డ్యుయా లిపా సంగీత కచేరీలో సంద‌డి చేస్తూ క‌నిపించింది. షారూఖ్‌ ట్రాక్ `వో లడ్కీ జో లెవిటేటింగ్` మాష‌ప్ చూశాక సుహానా కేరింత‌లు కొట్టింది. ఈ మాష‌ప్ లో అంతర్జాతీయ గాయని డ్యుయా లిపా ప్రదర్శనపై మెచ్చుకోలుగా స్పందించింది. సుహానా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ షో నుండి ఒక వీడియోను రీపోస్ట్ చేసింది.

సుహానా `ది ఆర్చీస్` అనే వెబ్ సిరీస్ లో న‌టించింది. ఈ సిరీస్ కి జోయా అక్తర్ దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా, నిర్మాత బోనీ కపూర్ కుమార్తె ఖుషీ కపూర్ ఈ సిరీస్ తో నటనా రంగ ప్రవేశం చేసారు. ఈ సిరీస్ అభిమానులు విమర్శకుల నుండి మిశ్రమ స్పంద‌న‌లు అందుకుంది. త‌న‌ తండ్రి షారూఖ్ ఖాన్ , అభిషేక్ బచ్చన్‌లతో కలిసి దర్శకుడు సుజోయ్ ఘోష్ యాక్షన్ థ్రిల్లర్ `కింగ్‌`లో సుహానా న‌టిస్తోంది. ఈ చిత్రం 2026లో థియేటర్లలోకి రానుంది. దీనికి సంబంధించిన అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.