Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : స్టార్‌ కిడ్ అందాల క్లోజప్‌ షో చూశారా?

సౌత్‌ లో స్టార్‌ కిడ్స్ హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది

By:  Tupaki Desk   |   10 July 2024 6:08 AM GMT
పిక్ టాక్ : స్టార్‌ కిడ్ అందాల క్లోజప్‌ షో చూశారా?
X

సౌత్‌ లో స్టార్‌ కిడ్స్ హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ బాలీవుడ్‌ లో మాత్రం ఇప్పటికే ఎంతో మంది స్టార్‌ కిడ్స్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. రాబోయే కాలంలో మరికొంత మంది కూడా బాలీవుడ్‌ లో హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ ఇప్పటికే నటిగా ఎంట్రీ ఇచ్చింది. తండ్రి ఇమేజ్ ను ఉపయోగించుకోకుండా, తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఉంది. అలాగే సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తోంది.

హీరోయిన్‌ గా సుహానా ఖాన్‌ కి బాలీవుడ్‌ యంగ్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు వస్తున్నాయట. కానీ ఈ అమ్మడు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇండస్ట్రీ లో అడుగు పెట్టి ఎంతో కాలం అవ్వలేదు అప్పుడే ఈ అమ్మడికి 5.5 మిలియన్ల ఫాలోవర్స్ ఇన్‌స్టాలో ఉన్నారు. అందాల ఫోటోలతో పాటు తన రెగ్యులర్ రొటీన్ లైఫ్‌ ని కూడా ఈ అమ్మడు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సుహానా ఖాన్‌ షేర్‌ చేసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

అందాల సుహానా ఖాన్ క్లోజప్ ఫోటోలతో కన్నుల విందు చేసింది. క్లీ వేజ్ షో అందాలను షేర్ చేయడంతో పాటు అందాల విందు చేస్తున్న సుహానా ముందు ముందు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ గా మంచి గుర్తింపు దక్కించుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.