Begin typing your search above and press return to search.

సాధారణ సమస్య అనుకుంటే అదే ప్రాణాలు తీసింది

సుహానీ మృతిపై ఆమె తల్లి పూజా భట్నాగర్ మాట్లాడుతూ... సుహానీ చర్మ సంబంధిత వ్యాధితో మృతి చెందింది.

By:  Tupaki Desk   |   19 Feb 2024 10:38 AM GMT
సాధారణ సమస్య అనుకుంటే అదే ప్రాణాలు తీసింది
X

అమీర్ ఖాన్‌ హీరోగా నటించిన దంగల్ తో మంచి గుర్తింపు దక్కించుకున్న బాల నటి సుహానీ భట్నాగర్‌. రికార్డ్‌ స్థాయి వసూళ్లు సాధించిన దంగల్ సినిమాలో బబితా కుమారి పాత్రను సుహానీ పోషించిన విషయం తెల్సిందే. దంగల్ తర్వాత సుహానీ కెరీర్‌ జెట్‌ స్పీడ్ అందుకుంది. అలాంటి సమయంలో అరుదైన వ్యాధితో సుహానీ మృతి చెందింది.

సుహానీ మృతిపై ఆమె తల్లి పూజా భట్నాగర్ మాట్లాడుతూ... సుహానీ చర్మ సంబంధిత వ్యాధితో మృతి చెందింది. ఆ విషయాన్ని మేము ఎవరితో కూడా చర్చించలేదు. సుహానీ గురించి ఎంతగానో పట్టించుకునే అమీర్ ఖాన్ గారికి కూడా మేము ఈ విషయాన్ని ముందస్తుగా తెలియజేయలేదు.

మొదట మేము సుహానీ యొక్క చర్మ సమస్య ను సాధారణ సమస్యగానే భావించాం. సాధారణ చర్మ సంబంధిత నిపుణులను సంప్రదించాం. చికిత్స కోసం ఎయిమ్స్ లో చేరిపించిన తర్వాత మాకు ఆమె పెద్ద సమస్యతో బాధ పడుతున్నట్లుగా అర్థం అయ్యింది.

డెర్మటోమయో సైటిస్ అనే వ్యాధి గా ఎయిమ్స్ వైధ్యులు గుర్తించారు. వ్యాధి ముదరడంతో ఇన్ఫెక్షన్‌ బారిన పడింది. దాంతో సుహానీ శ్వాస తీసుకోవడంకు కూడా ఇబ్బంది పడిందని పూజా భట్నాగర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రతి విషయంలో కూడా సుహానీ చాలా తెలివిగా వ్యవహరించేదని ఆమె అన్నారు.

దంగల్ నటి తల్లిదండ్రులుగా మాకు చాలా మంచి పేరు వచ్చింది. తను జీవితంలో ఎన్నో సాధించాలని ఆశ పడింది. కానీ ఇంత త్వరగా ఇలా జీవితాన్ని చాలిస్తుందని అనుకోలేదు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మేము గర్వించేలా చేసిన సుహానీ మృతి ని మేము జీర్ణించుకోలేక పోతున్నామని ఆమె పేర్కొన్నారు.