ఇలాగైతే కష్టం సుహాస్!
టాలీవుడ్ లో మంచి టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సుహాస్ సొంతం చేసుకున్నాడు.
By: Tupaki Desk | 16 Oct 2024 4:55 AM GMTటాలీవుడ్ లో మంచి టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సుహాస్ సొంతం చేసుకున్నాడు. రియలిస్టిక్ కథలతో మూవీస్ చేస్తూ నేచురల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలతో సుహాస్ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అల్ మోస్ట్ అందరు కొత్త దర్శకులతోనే సుహాస్ ఈ సినిమాలు చేసాడని చెప్పొచ్చు. వారు కూడా తమ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి అన్నట్లు రియలిస్టిక్ కథలని సుహాస్ తో చెప్పే ప్రయత్నం చేశారు.
ఈ ప్రయత్నం బాగానే ఉన్న ఎందుకనో ప్రేక్షకులు మాత్రం ఆశించిన స్థాయిలో సుహాస్ ని ఆదరించడం లేదనిపిస్తోంది. రీసెంట్ గా ‘జనక అయితే గనక’ సినిమాతో సుహాస్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ ట్రైలర్ ఇంప్రసివ్ గా అనిపించింది. డిఫరెంట్ కథాంశంతో ఈ మూవీ కథ ఉండబోతోందనే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. అయితే రిలీజ్ తర్వాత ఈ సినిమా ఏవరేజ్ టాక్ సొంతం చేసుకుంది.
గతంలో వచ్చిన ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’, ‘ప్రసన్నవదనం’ సినిమాలు కూడా ఇదే విధంగా యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నాయి. బ్రేక్ ఈవెన్ తక్కువ కావడంతో లాంగ్ రన్ లో టార్గెట్ ని అందుకున్నాయి. అదే సమయంలో ‘శ్రీరంగనీతులు’, ‘గొర్రె పురాణం’ అనే సినిమాలు కూడా సుహాస్ నుంచి వచ్చాయి. ఇవి థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేదు.
గతంలో ఎప్పుడో సుహాస్ ఈ రెండు సినిమాలు చేయగా చాలా ఆలస్యంగా రిలీజ్ అయ్యాయి. అయితే ఈ మూవీస్ ఓటీటీ కోసం తెరకెక్కించిన థియేటర్స్ లో కూడా రిలీజ్ చేశారు. దీంతో ఇవి సుహాస్ ఫ్లాప్ సినిమాల జాబితాలో చేరాయి. మంచి కథలు ఎంపిక చేసుకుంటున్నప్పటికి వాటిని ప్రేక్షకులకి నచ్చేలా తెరకెక్కించడంలో ఎక్కడో పొరపాటు జరుగుతుంది. సుహాస్ హీరో ఇమేజ్ అందుకున్నా రెండు గంటలు థియేటర్స్ లో ప్రేక్షకులని కథకి కనెక్ట్ అయ్యేలా చేయడంలో ఎక్కడో విఫలం అవుతున్నాడనే మాట వినిపిస్తోంది.
బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ రావడం కూడా కొంత మైనస్ అయ్యుండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. గతంలో మొదట్లో సక్సెస్ చూసిన ఒక వర్గం హీరోలు చాలా తొందరగా ఫేడ్ అవుట్ అవ్వడానికి కారణం కూడా ఇదే. క్యారెక్టర్ పరంగా కూడా ఎంతో డిఫరెంట్ కథలు చేస్తే గాని ఆడియెన్స్ ముందు నిలబడడం లేదు. తరుణ్, వరుణ్ సందేశ్ లాంటి హీరోలు ఓకే రకమైన ఫ్లోలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయడం వారికి మైనస్. ఇక సుహాస్ ఆ రూట్లో వెళ్లకుండా కాస్త చూసుకొని వెళితే బెటర్.
ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచి కూడా పూర్తిగా మారినట్లు కనిపిస్తోంది. అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. లేదంటే డిఫరెంట్ కంటెంట్ తో థ్రిల్లింగ్, మాస్ ఎలివేషన్ ఉండే కథలపై ఆసక్తిచూపిస్తున్నారు. ప్రేక్షకుల ఇంటరెస్ట్ ని దృష్టిలో ఉంచుకొని సుహాస్ ఇకపై కెరియర్ పరంగా కాస్తా ఆచితూచి అడుగులు వేస్తే బెటర్ అనే మాట వినిపిస్తోంది.