సుహాస్ చేస్తోన్న సినిమా నాగ చైతన్యతో!
సుహాస్ హీరోగా కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల `జకన అయితే గనక` అనే ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 Oct 2024 8:30 PM GMTసుహాస్ హీరోగా కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల `జకన అయితే గనక` అనే ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. సమాజంలో ఓ మధ్యతరగతి వ్యక్తి తండ్రి కావడానికి ఏ విధంగా ఆలోచిస్తాడు? అలాంటి వ్యక్తి తండ్రి అయితే ఎదురయ్యే పరిణామాలు ఏమిటి అనే కథాంశంతో రూపొందిస్తున్నారు. కొడుకును పెంచే స్తోమత తనకు లేదని భావించే ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి కథతో రూపొందిన ఈ చిత్రంలో ఎమోషన్స్ కి వపెద్ద పీట వేస్తున్నారు.
ఇందులో సుహాస్ కి జోడీగా సంగీర్తన నటిస్తోంది. అయితే ఈ సినిమాని తొలుత అక్కినేని వారసుడు నాగచైతన్యతో తెరకెక్కించాలనుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ సంగతి స్వయంగా దర్శకుడే తెలిపాడు. ఆ కథేంటో ఆయన మాటల్లోనే.. `ఈ చిత్రాన్ని హీరో నాగచైతన్యతో చేద్దాం అనుకున్నా. ఆయనతో కొంతకాలం జర్నీ కూడా చేశాను. ఈ సమయంలో ఆయనకు శేఖర్ కమ్ములతో `లవ్‌స్టోరీ` చిత్రం ఓకే కావడంతో బిజీ అయిపోయారు.
అందుకే నాగ చైతన్య ఈ సినిమా చేయలేకపోయారు. అప్పుడు నిర్మాత రాజు సుహాస్‌ను సజెస్ట్ చేయడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఇటీవల ఈ చిత్రం ప్రివ్యూను కొన్ని చోట్ల ప్రదర్శించాం. అందరి దగ్గరి నుంచి మంచి స్పందన వచ్చింది. యూనివర్శల్‌గా అందరూ కనెక్ట్ అయ్యే కథతో చేసిన సినిమా ఇది. ఈ కథను దిల్‌రాజు ఓకే చేసినప్పుడు సర్‌ఫ్రైజ్ అయ్యాను. ఆయన ఇలాంటి కథను ఒప్పుకుంటారని అనుకోలేదు.
ఇది తెలుగులో ఔట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా. తెలుగులో ఎప్పుడూ ఇలాంటి సినిమా రాలేదు. ఇలాంటి కొత్త కథను తప్పకుండా తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం వుంది. ఎందుకంటే మా గురువు ప్రశాంత్ నీల్ చెప్పినట్లుగా తెలుగు ప్రేక్షకులు దేవుళ్లు. సినిమా బాగుంటే తెలుగు ఆడియన్స్ విజయాన్ని అందిస్తారని నమ్మకం వుంది. ఈ సినిమాలో ఎలాంటి అడల్డ్ కంటెంట్ లేదు. మన కుటుంబంలో అందరూ డిస్కస్ చేసే అంశాన్ని ఇందులో చర్చించాం. నేను ప్రశాంత్ నీల్ దగ్గర పెద్ద కథలకు పనిచేశాను. ఆయన దగ్గర పనిచేసినప్పుడు రచయితగా అన్ని రకాల ఎమోషన్స్ రాశాను. కానీ నాకు అన్ని జోనర్ కథలతో సినిమాలు చేయాలని వుంది` అన్నారు.