Begin typing your search above and press return to search.

సుహాస్ సినిమా.. దిల్ రాజుకి ఎంత రావాలి?

యంగ్ హీరో సుహాస్ అందరికంటే వేగంగా మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నాడు.

By:  Tupaki Desk   |   13 Oct 2024 5:40 AM GMT
సుహాస్ సినిమా.. దిల్ రాజుకి ఎంత రావాలి?
X

యంగ్ హీరో సుహాస్ అందరికంటే వేగంగా మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. తక్కువ బడ్జెట్ లో రియాలిటీకి దగ్గరగా ఉండే కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులకి చేరువ అవుతున్నాడు. ఈ ఏడాది ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’, ‘ప్రసన్నవదనం’, ‘శ్రీరంగనీతులు’, ‘గొర్రెపురాణం’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాలన్ని కూడా నేచురల్ కథలతో తెరకెక్కినవే కావడం విశేషం. ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్ లో ‘జనక అయితే గనక’ మూవీతో ప్రేక్షకులని పలకరించాడు.

అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో ఒక డిఫరెంట్ పాయింట్ ని ఈ సినిమాలో దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల చెప్పాలని అనుకున్నాడు. కానీ సినిమా ఆడియెన్స్ కు పెద్దగా కనెక్ట్ కాలేనట్లు అనిపిస్తోంది.. ప్రీమియర్స్ వేసినా కూడా మొదటి రోజు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. మరి మిగతా రోజుల్లో ఏమైనా ప్రభావం చూపుతుందేమో చూడాలి. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి దిల్ రాజు ప్రొడక్షన్ లో ‘బలగం’, ‘లవ్ మీ’ సినిమాల తర్వాత మూడో చిత్రంగా ‘జనక అయితే గనక’ వచ్చింది.

జీవితంలో సరైన సంపాదన లేకుండా పిల్లలు వద్దనుకునే యువకుడి కథగా ఈ మూవీ ఉంటుంది. దసరా రేసులో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకి మౌత్ టాక్ ప్రధాన బలం. కానీ ఆడియెన్స్ నుంచి సరైన రెస్పాన్స్ అయితే లేదు. ఇక ఈ ఏడాది సుహాస్ నుంచి వచ్చిన నాలుగు సినిమాలలో కమర్షియల్ సక్సెస్ అందుకున్న మూవీ ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు’ మాత్రమే. మిగిలిన సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి.

దిల్ రాజు బ్యానర్ నుంచి ‘జనక అయితే గనక’ మూవీ వస్తుండటంతో 3.5 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అంటే 4 కోట్ల కలెక్షన్స్ అందుకుంటే సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంటుంది. ఇది పెద్ద టార్గెట్ అయితే ఏమీ కాదు. కానీ ఈ సినిమాకి పోటీగా ‘విశ్వం’, ‘వేట్టయన్’ లాంటి పెద్ద మూవీస్ ఉన్నాయి. ‘విశ్వం’ కి ఎంటర్టైన్మెంట్ పాయింట్ లో కొంత మిక్స్ డ్ టాక్ వస్తోంది.

ఈ నేపథ్యంలో దసరా ఫైట్ ‘విశ్వం’, ‘జనక అయితే గనక’ చిత్రాల మధ్యలో ఉందని చెప్పొచ్చు. ఈ మూవీ సక్సెస్ అయితే సుహాస్ కి మరిన్ని అవకాశాలు పెద్ద బ్యానర్స్ లలో రావడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. మరి వీకెండ్ అనంతరం ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి. ఇక ప్రస్తుతం సుహాస్ లైన్ అప్ లో మరో 4 సినిమాల వరకు ఉన్నాయనే టాక్ నడుస్తోంది.