Begin typing your search above and press return to search.

ఓ భామ అయ్యో రామ.. ఈ క్యాచీ టైటిల్ సాంగ్ విన్నారా..

ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రావడంతో, ఇప్పుడు టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. "ఎలాగుండే వాడ్నే ఎలాగా అయిపోయానే…" అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

By:  Tupaki Desk   |   3 April 2025 1:14 PM
ఓ భామ అయ్యో రామ.. ఈ క్యాచీ టైటిల్ సాంగ్ విన్నారా..
X

హిట్‌ చిత్రాలతో యువత మనసు దోచుకుంటున్న హీరో సుహాస్, ఈసారి ఓ ఫీల్ గుడ్‌ లవ్‌ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం పేరు ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో ‘జో’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మాళవిక మనోజ్ ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. రామ్ గోదాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హరీష్ నల్ల నిర్మించగా, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ద్వారా విడుదల చేయనున్నారు. వేసవిలో ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది.

ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రావడంతో, ఇప్పుడు టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. "ఎలాగుండే వాడ్నే ఎలాగా అయిపోయానే…" అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రోతలను మొదటి నోటే తాకేలా చేసిన ఈ పాటకు శ్రీహర్ష ఈమని అందించిన సాహిత్యం, శరత్ సంతోష్ గాత్రం, రథన్ స్వరాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ పాటకు మెయిన్ మాస్టర్ చక్కటి కొరియోగ్రఫీ అందించారు.

ఈ సందర్భంగా నిర్మాత హరీష్ మాట్లాడుతూ, “ఈ పాట పూర్తిగా యూత్‌ఫుల్ వాతావరణాన్ని తెరపై చూపిస్తుంది. సుహాస్, మాళవిక మధ్య వచ్చే కెమిస్ట్రీ పాటలో స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా మొత్తం ప్రేక్షకులకు సరదాగా ఉండేలా ప్లాన్ చేశాం. మంచి కంటెంట్‌తో, ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌ను అందించబోతున్నాం” అని తెలిపారు.

దర్శకుడు రామ్ గోదాల మాట్లాడుతూ, ఈ కథకు రథన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మొత్తం ఆరు పాటలు ఉన్న ఈ సినిమాలో ఒక్కో పాట ఒక్కో జోనర్‌ను చూపిస్తుంది. ఇప్పుడే విడుదల చేసిన టైటిల్ సాంగ్ యూత్‌ని ఆకట్టుకునేలా ఉంది. కథ, పాటలు, నటుల పనితీరు అన్నీ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపేలా చేశాయని అన్నారు. అలాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా రూపొందించినట్లు చెప్పారు.

ఈ పాటను చూసినవారంతా.. ఇది ఓ క్యూట్ లవ్ స్టోరీ అని అభిప్రాయపడుతున్నారు. లిరికల్ వీడియోలో చూపించిన ఫ్రేమ్స్ అన్నీ కలర్‌ఫుల్‌గా ఉండటంతో పాట చూసే వాళ్లకు ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతోంది. సుహాస్, మాళవిక జంటలో చూపించిన ఎనర్జీ ఈ పాటలో స్పష్టంగా కనిపిస్తుంది. డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకునేలా ఉండటంతో పాటకు మరింత హైప్ వచ్చింది. యూత్‌లో ఈ సాంగ్ వేగంగా ట్రెండ్ అవుతోంది. మొత్తానికి, ‘ఓ భామ అయ్యో రామ’ టైటిల్ సాంగ్ సినిమా ఆసక్తిని రెట్టింపు చేసింది. ఇకపోతే మేకర్స్ త్వరలో ఆడియో ఆల్బమ్, థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.