Begin typing your search above and press return to search.

మిడిల్ క్లాస్ కష్టాలతో సుహాస్ సాంగ్ అదిరింది..!

ఏం పాపం చేశామో అంటూ సాగిన ఈ పాటని కృష్ణ కాంత్ రాయగా రితేష్ జి ఆలపించారు.

By:  Tupaki Desk   |   21 Sep 2024 4:50 AM GMT
మిడిల్ క్లాస్ కష్టాలతో సుహాస్ సాంగ్ అదిరింది..!
X

యువ హీరోల్లో కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్న సుహాస్ ఒక సినిమా ఇలా వచ్చిందో లేదో అలా మరో సినిమాను రిలీజ్ కు సిద్ధం చేస్తున్నాడు. ఈసారి దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా జనక అయితే గనక సినిమా చేశాడు. సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 12న రిలీజ్ ప్లాన్ చేశారు. దసరా కానుకగా రాబోతున్న ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్ని ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాయి.

లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు. ఏం పాపం చేశామో అంటూ మిడిల్ క్లాస్ ఎంప్లాయీ పడే తంటాలు చాలీచాలని జీతం తో అతని పడే బాధలను ఫన్నీగా చూపించారు. ఏం పాపం చేశామో అంటూ సాగిన ఈ పాటని కృష్ణ కాంత్ రాయగా రితేష్ జి ఆలపించారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించారు. సెప్టెంబర్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్న ఈ సినిమా అక్టోబర్ 12న రిలీజ్ చేస్తున్నారు.

సుహాస్ సినిమా అంటే కచ్చితంగా అందులో సంథింగ్ స్పెషల్ ఉంటుందనిపించేలా చేసుకున్నాడు. కథ బాగుంటే చాలు ఎలాంటి ప్రయోగాలకైనా తను సిద్ధమే అన్నట్టుగా సుహాస్ సిద్ధంగా ఉన్నాడు. జనక అయితే గనక సినిమా కూడా నిరోద్ సంస్థ మీద కేస్ వేసే కథాంశంతో ఈ సినిమా వస్తుంది. సినిమా టీజర్ కి ఇప్పటికే మంచి లైక్స్ రాగా సినిమా కోసం కూడా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతూ వస్తున్న సుహాస్ జనక అయితే గనక సినిమాతో కూడా మరో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. బలగం సినిమాతో తమ మొదటి సినిమానే సెన్సేషనల్ హిట్ అందుకున్న హర్షిత్, హన్షిత రెడ్డి ఈ సినిమాతో కూడా మరో సక్సెస్ ని టార్గెట్ పెట్టుకున్నారు. జనక అయితే గనక పై చిత్ర యూనిట్ గట్టి నమ్మకంగా ఉన్నారు మరి అది ప్రేక్షకులపై ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది చూడాలి. కథ కథనాలు నచ్చితే చాలు ఎలాంటి సినిమా అయినా సరే ఆడియన్స్ హిట్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో సుహాస్ సినిమాలకు బజ్ బాగానే ఉంది కాబట్టి ఈ సినిమాకు ఆ హిట్ ఫ్యాక్టర్ రిపీట్ అవుతుందేమో చూడాలి.