Begin typing your search above and press return to search.

పెళ్లైన నాలుగేళ్ల‌కి హ‌నీమూన్ వెళ్లిన న‌టుడు!

మ‌రో రెండు మూడు విజ‌యాలు ప‌డితే సుహాస్ కెరీర్ కి కొన్నాళ్ల పాటు తిరుగుండ‌దు

By:  Tupaki Desk   |   29 April 2024 12:30 AM GMT
పెళ్లైన నాలుగేళ్ల‌కి హ‌నీమూన్ వెళ్లిన న‌టుడు!
X

సుహాస్ పేరిప్పుడు నెట్టింట జోరుగా వినిపిస్తుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకొచ్చి స‌క్సెస్ అయిన న‌టుడిగా సుహాస్ కి మంచి గుర్తింపు ద‌క్కింది. చిన్న చిన్న‌పాత్ర‌ల‌తో మొద‌లైన అతనిప్పుడు హీరోగా మారండంతో మ‌రింత మైలేజ్ వ‌స్తోంది. `అంబాజీపేట మ్యారేంజ్ బ్యాండ్` తో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు వ‌చ్చింది. ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. పారితోషికంగా కూడా మునుప‌టి కంటే బాగానే అందుకుంటున్నాడు. ఇలా అన్ని విష‌యాల్లో సుహాస్ మెరుగ్గా క‌నిపిస్తున్నాడు.

మ‌రో రెండు మూడు విజ‌యాలు ప‌డితే సుహాస్ కెరీర్ కి కొన్నాళ్ల పాటు తిరుగుండ‌దు. క‌మెడియ‌న్లు హీరోల‌గా స‌క్సెస్ అయింది లేదు గానీ..సుహాస్ లాంటి వైవిథ్య‌మైన పాత్ర‌ధారుడికి మాత్రం ఆ ఛాన్స్ క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతానికి కెరీర్ ప‌రంగా దిల్ ఖుష్ అంటున్నాడు. కానీ ఒక‌ప్ప‌టి అత‌ని జీవితం వేరు. పెళ్లైన కొత్త‌లో వెళ్లాల్సిన హానీమూన్ కి నాలుగేళ్ల త‌ర్వాత వెళ్లానంటూ న‌వ్వేసాడు. ఓసారి గ‌త జీవితంలో కి వెళ్లిపోయాడు.

`ఆర్టిస్ట్‌ కావాలనే ధ్యేయంతో ఆఫీసుల చుట్టూ తిరిగే వాణ్ణి. ఎన్నో ఆడిషన్స్‌లో పాల్గొన్నా. కానీ అవకాశం రాలేదు. అప్పుడు షార్ట్‌ ఫిల్మ్స్‌ చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అవే నాకు గుర్తింపు తెచ్చాయి. ప్రారంభంలో రెండు మూడేళ్లు స్టగుల్‌ తప్పలేదు. ప్రేమ విషయం ఓకే కానీ, పెళ్లి జరిగే సమయానికి ఉద్యోగం చేస్తున్నా. నెలనెలా జీతం వస్తుంది కనుక ఆ ధైర్యంతో పెళ్లి చేసుకున్నాను. పెళ్లయిన తర్వాత కూడా స్ట్రగుల్‌ ఉండేది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి కొంత బెటర్‌ అయింది కానీ తక్కువ డబ్బు వచ్చేది.

‘కలర్‌ ఫొటో’ తర్వాత లైఫ్‌లో సెటిల్‌ అయ్యాయని చెప్పాలి. ఆదాయం పెరిగిన తర్వాత, అంటే పెళ్లయిన నాలుగేళ్లకి మా ఆవిడను హనీమూన్‌కు తీసుకెళ్లా. అదికూడా... మాల్దీవులకే వెళ్లాలని మొదటి నుంచి ఫిక్స్‌ అయ్యా. డబ్బు వచ్చిన తర్వాత మా తొలి విదేశీ యాత్ర అదే. సినిమాల విషయంలో నా భార్య క‌ల్పించుకోదు. ఇంట్లో సినిమాల ప్రసక్తి రాదు. కానీ ఆర్థిక విషయాలు మాత్రం తను డీల్‌ చేస్తుంటుంది. మాకు ఓ బాబు. ఈ మధ్యే పుట్టాడు. తీరిక దొరికితే చాలు వాడితో గడుపుతుంటా. నా సినిమాలకు ఎంత మార్కెట్‌ ఉందో నాకు తెలుసు కనుక ఆ బడ్జెట్‌ దాటితే సినిమా చేయనని దర్శకనిర్మాతలకు ముందే చెప్పేస్తున్నా. ఓటీటీలో నా సినిమాను ఇంతకు కొంటున్నారు కనుక ఆ బడ్జెట్‌లోనే చేద్దాం.. థియేటర్లలో వచ్చేది మనకు బోనస్‌ అని చెబుతున్నా. దానినిబట్టి నా పారితోషికం తీసుకుంటున్నా` అని అన్నారు.