లైట్ బోయ్ నుంచి హీరో వరకూ!
ప్రతిభకి ఎప్పుడు పరిశ్రమ పట్టం కడుతుంది. కాకపోతే కాస్త ఆలస్యమవుతుందంతే. అందుకు అదృష్టం కూడా కలిసి రావాలనుకోండి.
By: Tupaki Desk | 20 March 2024 9:01 AM GMTప్రతిభకి ఎప్పుడు పరిశ్రమ పట్టం కడుతుంది. కాకపోతే కాస్త ఆలస్యమవుతుందంతే. అందుకు అదృష్టం కూడా కలిసి రావాలనుకోండి. ఎంతో మంది ప్రతిభావంతులున్నా? అవకాశం రావడం అన్నదే అసలైన లక్. అలా ఛాన్సు వచ్చి ప్రూవ్ చేసుకుంటే నిలబడినట్లే. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వివిధ శాఖల్లో ఎదిగిన వారెంతో మంది ఉన్నారు. పరిశ్రమకి ఎప్పుడు కొత్త నీరు అలా వస్తూనే ఉంటుంది. ఇటీవలి కాలంలో అలా సక్సెస్ అయిన నటుడి గురించి చెప్పుకోవాలంటే సుహాస్ టాపిక్ తప్పని సరి.
అతడు ఎలాంటి బ్యాకప్ లేకుండా వచ్చి సక్సెస్ అయినవాడే. ఇండస్ట్రీలో వంద రూపాయలతో ప్రయాణం మొదలు పెట్టి నేడు కోట్లకు పడగెత్తాడు. తొలుత లైట్ బోయ్ గా చేరాడు. అటుపై డైరక్షన్ డిపార్ట్ మెంట్ ఇలా రకరకాల శాఖల్లో పనిచేసి పరిచయాలు పెంచుకున్నాడు. అటుపై ప్రతిభను నిరూపించుకేనే వకాశం వచ్చింది. పడి పడి లేచే మనసుతో తొలిసారి మ్యాకప్ వేసుకున్నాడు. అటుపై `మజిలి` లో సరైన రోల్ పడింది.
ఆ తర్వాత `డియర్ కామ్రేడ్`...`ప్రతి రోజు పండగే` లాంటి సినిమాల్లో నటించాడు. సరిగ్గా ఇదే సమయంలో `కలర్ ఫోటో` అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కమర్శియల్ గాసక్సెస్ కానప్పటికీ జాతీయ అవార్డు రావడంతో సుహాస్ పేరు మరింత వెలుగులోకి వచ్చింది. అదే ఐడెంటీ కొత్త అవకాశాలు సృష్టించింది. అప్పటివరకూ చిన్న పాత్రలు చేసే సుహాస్ కి అప్పటి నుంచి పాత్రల ఫరిది పెరిగింది.
ఏడాదిలో అతని సినిమాల సంఖ్య పెరిగింది. ఇక` అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్` తో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ప్రస్తుతం అతడి చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. వాటిలో కొన్ని షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. కేబుల్ రెడ్డి..శ్రీరంగ నీతులు..ప్రసన్న వదనం.. ఆనందరావు అడ్వెంచర్స్.. గొర్రె పురాణం ఇలా కొన్ని సినిమాల్లో సుహాస్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమా విజయాలు అతడి కెరీర్ ని నిర్దేశించే అవకాశం ఉంది. విజయాలు అందుకుంటే నటుడిగా మరింత బిజీ అవుతాడు.