Begin typing your search above and press return to search.

సినిమా కోసం రిస్క్ తీసుకుంటున్న సుహాస్

నాని తర్వాత ఆ తరహా నాచురల్ పెర్ఫార్మెన్స్ తో సుహాస్ ఆకట్టుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   25 Aug 2024 5:54 AM GMT
సినిమా కోసం రిస్క్ తీసుకుంటున్న సుహాస్
X

టాలెంటెడ్ యాక్టర్ గా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న నటుడు సుహాస్. కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిన సుహాస్ తరువాత రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్నవదనం సినిమాలతో హీరోగా సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాలు హిట్ అవ్వడంతో ఇప్పుడు సుహాస్ కి మెయిన్ లీడ్ గా వరుస అవకాశాలు వస్తున్నాయి. నాని తర్వాత ఆ తరహా నాచురల్ పెర్ఫార్మెన్స్ తో సుహాస్ ఆకట్టుకుంటున్నాడు.


అలాగే రియాలిటీకి దగ్గరగా ఉండే కథలని ఎంచుకొని ప్రేక్షకులకి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు కూడా సుహాస్ తో మూవీస్ నిర్మించడానికి ముందుకొస్తున్నాయి. చాలా మంది ప్రొడ్యూసర్స్ తో సుహాస్ ఇప్పటికే మూవీస్ కమిట్ అయ్యి ఉన్నాడు. అయితే తనకి సరిపోయే కథలని ఎంపిక చేసుకుంటూ సెలక్టివ్ గా మూవీస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే దిల్ రాజు ప్రొడక్షన్స్ లో బలగం తర్వాత ప్రొడక్షన్ నెంబర్ 3గా వస్తోన్న మూవీ 'జనక అయితే గనక'.

హర్షిత రెడ్డి, హన్షిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సలార్ సినిమాకి డైలాగ్స్ రాసిన సందీప్ రెడ్డి బండ్ల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకొంది. సినిమాలో సుహాస్ ఒక మిడిల్ క్లాస్ యువకుడిగా కనిపిస్తున్నాడు. తన భార్య, పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని కలలుకంటూ ఉండే పెళ్లికాని కుర్రాడిగా కనిపించబోతున్నాడు. నిజానికి డబ్బుని విపరీతంగా సేవ్ చేసే ఇలాంటి వారిని పిసినారి అంటారు.

అలాంటి ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ తో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. దిల్ రాజు భారీ ఎత్తున ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 7న మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో హీరో సుహాస్ డిస్టిబ్యూటర్ గా మారబోతున్నాడంట. యూఎస్ రిలీజ్ రైట్స్ ని సుహాస్ దిల్ రాజు నుంచి తీసుకున్నారంట. తాజాగా మూవీ ఈవెంట్ లో సుహాస్ ఈ విషయాన్ని రివీల్ చేశారు.

అయితే కెరియర్ ఆరంభంలోనే ఇలా డిస్టిబ్యూటర్ గా అవతారం ఎత్తడం అంటే రిస్క్ తో కూడుకున్న పని అనే మాట వినిపిస్తోంది. అయితే సుహాస్ కి యాక్టింగ్ అనేది ఇష్టమైన పని. తనని తాను స్టార్ యాక్టర్ గా రిప్రజెంట్ చేసుకోవడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోడు. అందుకే ఈ సినిమా కోసం రిస్క్ తీసుకోవడానికి రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. జనక అయితే గనక మూవీ తర్వాత సుహాస్ చేతిలో హీరోగా మరో మూడు సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి. అలాగే ఓ మూవీలో క్యామియో రోల్ చేస్తున్నాడు.