Begin typing your search above and press return to search.

చిరంజీవితో ఆ రికార్డ్ ఆమెకు మాత్రమే సొంతం..!

ఇంతకీ ఎవరామె చిరంజీవితో ఇలా రకరకాల పాత్రల్లో నటించి రికార్డ్ దక్కించుకున్న ఏకైక నటి ఎవరు అంటే ఆమె వర్సటైల్ యాక్టర్ సుజాత అని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   18 Oct 2024 7:30 PM GMT
చిరంజీవితో ఆ రికార్డ్ ఆమెకు మాత్రమే సొంతం..!
X

150కి పైగా సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో రికార్డులు, రివార్డులు అందుకున్నారు. ఐతే ఇన్నేళ్ల సినీ చరిత్రలో ఆయనతో ఒకే ఒక్క హీరోయిన్ మాత్రమే పలు రకాల పాత్రలతో నటించి అలరించింది. అంటే చిరంజీవితో పలు సినిమాల్లో ఆమె ప్రేయసి, భార్య, సోదరి, తల్లి ఇలా వివిధ పాత్రల్లో నటించింది. ప్రేయసిగా నటించిన ఆమె చివరికి ఆయన తల్లిగా కూడా చేసింది. ఇంతకీ ఎవరామె చిరంజీవితో ఇలా రకరకాల పాత్రల్లో నటించి రికార్డ్ దక్కించుకున్న ఏకైక నటి ఎవరు అంటే ఆమె వర్సటైల్ యాక్టర్ సుజాత అని తెలుస్తుంది.


సౌత్ సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు సుజాత. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఆమె దాదాపుగా 300 పైగా సినిమాలు చేశారు. సీనియర్ హీరోలతో జత కట్టిన ఆమె ఆ తర్వాత తరం హీరోలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఐతే అందులో చిరంజీవితో ఆమె ప్రేయసిగా నటించడమే కాకుండా చెల్లి, భార్య, తల్లి ఇలా డిఫరెంట్ రోల్స్ లో నటించారు. చిరంజీవి నటించిన ప్రేమ తరంగాలు సినిమా 1980లో వచ్చింది. కృష్ణం రాజు, చిరంజీవి కలిసి నటించిన ఈ సినిమాలో సుజాత చిరంజీవి ప్రేయసిగా నటించారు. ఇదే సినిమాలో వీరికి పెళ్లి జరుగుతుంది.

ఇక చిరంజీవి నటించిన సీతాదేవి సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో నటించింది సుజాత. ఇక చిరు హీరోగా నటించిన బిగ్ బాస్ సినిమాలో సుజాత ఆయనకు తల్లిగా నటించింది. ఇలా ఒకే కథానాయిక ఒక హీరోతో ఇలా రకరకాల పాత్రల్లో నటించడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా చిరంజీవితో ఇలా నటించిన నటిగా సుజాత సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్నారు.

కెరీర్ మొదలు పెట్టిన నాటి నుంచి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుజాత ఒక దశలో తల్లి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. చివరి రోజుల వరలు ఆమె సినిమాల్లో నటిస్తూనే ఉంది. సుజాత లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మళ్లీ తెలుగు తెర మీద కనిపించడం కష్టమని చెప్పొచ్చు. ఎలాంటి పాత్ర అయినా ఆమె అవలీలగా నటించి మెప్పించే వారు. మదర్ పాత్రకు ఆమె ఒక స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చారు. ఐతే చిరంజీవితో మాత్రమే ఇలా డిఫరెంట్ రోల్స్ చేసి స్పెషల్ రికార్డ్ తన పేరున ఏర్పరచుకున్నారు.