Begin typing your search above and press return to search.

పవన్, ప్రభాస్ కాంబో… యువ డైరెక్టర్ బిగ్ డ్రీమ్!

ఇదిలా ఉంటే సాహో మూవీతో సుజిత్ పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ సినిమా చేశారు.

By:  Tupaki Desk   |   27 May 2024 9:30 AM GMT
పవన్, ప్రభాస్ కాంబో… యువ డైరెక్టర్ బిగ్ డ్రీమ్!
X

యంగ్ డైరెక్టర్ సుజిత్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేసి సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిపోయి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మరల పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సాహో మూవీతో సుజిత్ పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ సినిమా చేశారు.

అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఓజీ మూవీపైన సుజిత్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తాజాగా భజే వాయువేగం మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో సుజిత్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నారని తెలిపారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఓ రీమేక్ మూవీ కోసం తనని రమ్మని చెప్పారని, కొత్త కథ ఏదైనా ఉందా అని అడిగారని, అప్పుడు ఓజీ స్టోరీ నేరేట్ చేశానని అన్నారు.

ఓజీ కథ నచ్చడంతో వెంటనే ఒకే చేశారని సుజిత్ క్లారిటీ ఇచ్చాడు. ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్, లుక్స్ పరంగా ఇప్పటికే పవర్ స్టార్ అభిమానులని సుజిత్ మెప్పించాడు. ఈ మూవీ గ్లింప్స్ పబ్లిక్ కి విపరీతంగా కనెక్ట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో చాలా స్టైలిష్ గా ఉన్నాడనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించాలనేది తన కల అని సుజిత్ ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజంగా సుజిత్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ చేస్తే అది అన్ని రికార్డులని బ్రేక్ చేస్తుందని పవర్ స్టార్ అభిమానులు అంటున్నారు.

సాహో, ఓజీ మూవీలలో క్యారెక్టర్స్ ని కలుపుతూ మంచి కథని సిద్ధం చేసి మూవీ చేయాలని అటు ప్రభాస్ అభిమానులు ఇటు పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో టాలీవుడ్ నుంచి రాజమౌళి స్థాయిలో సక్సెస్ సత్తా చూపించే దర్శకుల జాబితాలో సుజిత్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతని నుంచి ప్రభాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.