ప్రేమికుల రోజు: జాక్విలిన్‌కి ప్రయివేట్ జెట్ కానుక
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా జాక్విలిన్ ఫెర్నాండెజ్‌కు సుకేష్ ఒక లేఖ రాశాడు. తమ ప్రేమకు చిహ్నంగా తాను ఆమెకు ఒక ప్రైవేట్ జెట్‌ను బహుమతిగా ఇస్తున్నట్లు వెల్లడించాడు.
By: Tupaki Desk | 14 Feb 2025 12:31 PM GMT200 కోట్ల స్కామ్‌లో అరెస్టయిన సుఖేష్ చంద్రశేఖర్ ప్రముఖులను మోసం చేసిన కేసులో విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అతడికి పలువురు కథానాయికలతో సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది. శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ కి అతడు ఖరీదైన కానుకలు ఇచ్చాడని దర్యాప్తులో వెల్లడైంది. అయితే తామిద్దరం ప్రేమలో ఉన్నామని సుకేష్ చెబుతున్నాడు. అతడు జాక్విలిన్ కి నిరంతరం ప్రేమలేఖలు రాస్తున్నాడు. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు తాను ఇటీవల ఇచ్చిన బహుమతి `పూర్తిగా చట్టబద్ధమైనది` అని స్పష్టం చేశారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా జాక్విలిన్ ఫెర్నాండెజ్‌కు సుకేష్ ఒక లేఖ రాశాడు. తమ ప్రేమకు చిహ్నంగా తాను ఆమెకు ఒక ప్రైవేట్ జెట్‌ను బహుమతిగా ఇస్తున్నట్లు వెల్లడించాడు.
అయితే ఈ బహుమతులపై తాను పన్నులు చెల్లిస్తున్నానని, అందువల్ల ఎవరూ వాటిని చట్టవిరుద్ధమని చెప్పలేరని సుఖేష్ స్పష్టం చేశాడు. నేను కానుక ఇచ్చిన జెట్ గురించి మిమ్మల్ని ప్రశ్నించలేరు. ఎందుకంటే బేబీ (జాక్విలిన్) నేను ఈ సంవత్సరం నా పన్ను రిటర్న్‌లలో జెట్ ను ప్రకటిస్తున్నాను. దానికి సంబంధించిన బహుమతి పన్నులను చెల్లిస్తున్నాను. ఇది పూర్తిగా చట్టబద్ధమైనది. నేరపూరిత ఆదాయం కాదు! అని సుఖేష్ లేఖలో రాసారు.
సుకేష్ చంద్రశేఖర్ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా జాక్విలిన్ పై తన ప్రేమను దాచుకోలేదు. ఈ వాలెంటైన్స్ డే రోజున బేబీ, నాకు ఒకే ఒక కోరిక ఉంది. పునర్జన్మ అనేది ఉంటే నేను నీ హృదయంగా పుట్టాలి. తద్వారా నేను నీలో కొట్టుకుంటూ ఉండగలను అని అన్నారు. సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం దోపిడీ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నాడు. జాక్వెలిన్‌తో అతడి రిలేషన్‌షిప్‌పై పుకార్లు ఉన్నాయి. సుకేష్‌తో తనకు ఎలాంటి లవ్ రిలేషన్ లేదని జాక్విలిన్ పేర్కొన్నా.. ఈ కేసులో నిందితురాలు గనుక ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ఆమెను చాలాసార్లు ప్రశ్నించింది. జాక్వెలిన్‌కు మోసగాడు సుకేష్ దోపిడీదారుడని తెలుసని కేంద్ర ఏజెన్సీ విశ్వసిస్తోంది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో జాక్విలిన్ కుటుంబం, స్నేహితులు కూడా సుకేష్‌తో ఆమెకు ఉన్న సంబంధం నుండి `లాభం` పొందారని కేంద్ర ఏజెన్సీ పేర్కొంది.
అయితే ప్రేమ లేఖల పేరుతో సుకేశ్ తన ప్రతిష్టను దిగజార్చడానికి మీడియాను ఒక సాధనంగా ఉపయోగించుకున్నాడని జాక్విలిన్ ఆరోపించింది. అతడి నుంచి వేధింపులు ఆపాలని, కేసు నమోదు చేయాలని కోర్టును కోరింది. అయితే జాక్విలిన్ తరువాత తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.