బేబి వనవాసం నుంచి వచ్చేస్తున్నాను.. నీతోనే ఉంటాను! జాక్విలిన్‌కి సుకేష్ ట్విస్ట్!!
అదే సమయంలో తమ ప్రేమ కథ రామాయణం కంటే తక్కువ కాదు అనేశాడు సుకేష్.
By: Tupaki Desk | 30 Oct 2024 4:33 PM GMTజైలు నుంచే అందాల నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్ కు ప్రేమలేఖలు రాస్తూ నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లోకొస్తున్నాడు కాన్మన్ సుకేష్ చంద్రశేఖర్. ఇప్పటికే అతడు జాక్విలిన్ తన ప్రేయసి అని, తనతో నిండా ప్రేమలో ఉన్నానని ప్రకటించాడు. జైలు నుంచే వరసగా ప్రేమలేఖలు రాస్తున్నాడు. ఇప్పుడు 'హౌస్‌ఫుల్ 5' కోసం సిద్ధమవుతున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కి మరో ఊహించని ట్విస్ట్. 2022లో జాక్విలిన్ - సుకేష్ జంట క్లోజ్ గా ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయిన తర్వాత జాక్విలిన్ నిజంగానే సుకేష్ చంద్రశేఖర్ ప్రియురాలు అని ప్రజలు నమ్ముతున్నారు. సుకేష్ అదే చొరవతో జాకీకి ప్రేమలేఖలు రాస్తున్నాడు. ఇప్పుడు జాక్వెలిన్‌కి 'దీపావళి శుభాకాంక్షలు' తెలియజేసాడు సుకేష్. అదే సమయంలో తమ ప్రేమ కథ రామాయణం కంటే తక్కువ కాదు అనేశాడు సుకేష్. అయితే జాక్విలిన్ మాత్రం తన ప్రేమను కన్ఫామ్ చేయలేదు. సుకేష్ చంద్రశేఖర్ పై న్యాయపోరాటానికి దిగింది.
దోపిడీ కేసులో ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్ దీపావళి సందర్భంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మరో లేఖ రాశాడు. సుకేష్ వారి సంబంధాన్ని హిందూ ఇతిహాసం రామాయణంతో పోల్చారు. తన లేఖలో జాక్వెలిన్‌ను ప్రేమగా 'బేబి' అని సంబోధిస్తూ తాను ఒక పిచ్చోడిలా మిస్ అవుతున్నానని తెలిపాడు. ఈ దీపావళి 'అత్యంత ప్రత్యేకమైనది' అని పేర్కొన్నాడు. తాను మరో రెండు బెయిల్ల కోసం ఎదురు చూస్తున్నానని తెలిపాడు. ఈసారి పండుగ తనకు చాలా భిన్నంగా ఉందని, భవిష్యత్తులో తాను జైలు నుంచి విడుదలయ్యే అవకాశాన్ని సూచిస్తోందని సుకేష్ పేర్కొన్నాడు. సుకేష్ తన ఇంటికి వెళుతున్నానని రాసాడు.
ఈ లేఖలో ఇలా రాసాడు. ''బేబీ మన ప్రేమకథ 'రామాయణం' కంటే తక్కువ కాదు. ఎందుకంటే రాముడు తన సీతతో వనవాసం నుండి తిరిగి వచ్చినట్లే, నేను కూడా ఈ పొట్టి వనవాసం నుండి తిరిగి వస్తున్నాను. నా సీత, జాక్వెలిన్ ను మళ్లీ గెలుచుకుంటాను. ఇది జరగకుండా ఏ రావణుడు ఆపలేడు. రాముడి ఆశీర్వాదం ఏమిటంటే నాకు నీపై ఉన్న ప్రేమ. ఇప్పుడు మన టైమ్ వచ్చింది బేబీ''అని లేఖలో రాసాడు. ''బేబీ ఇప్పుడు ఇంటికి తిరిగి రావడానికి సమయం దగ్గరపడింది. నేను కలిసి ఉండటానికి వేచి ఉండలేను.. వచ్చే ఏడాది ఈ అందమైన దీపాల పండుగను కలిసి జరుపుకుంటాను'' అని రాసాడు. ఇది నా చివరి దీపావళి.. ఇక్కడ మీరు లేకుండా లంకలో .... నా ఆడపిల్ల! అని లేఖలో రాసాడు.
ప్రపంచం నన్ను పిచ్చివాడినని అనుకోవచ్చు కానీ.. మన మధ్య ఏముందో ప్రపంచానికి ఎప్పటికీ తెలుసు! అని సుకేష్ అన్నాడు. జాక్విలిన్ నటించిన తాజా పాట 'స్టోర్మ్‌రైడర్'కి తన మద్దతును ఇస్తూ.. సుకేష్ యూట్యూబ్‌లో ఆమె ట్రాక్‌కి గరిష్ట వీక్షణలను అందించే అభిమానులకు ''25 మహీంద్రా థార్ రోక్స్'... 200 ఐఫోన్ 16 ప్రో''లను బహుమతిగా ఇస్తానని కూడా ప్రకటించాడు.