Begin typing your search above and press return to search.

జాక్విలిన్‌కి మ‌రో ప్రేమ‌లేఖ రాసిన సుకేష్‌

సుకేష్ చంద్రశేఖర్ లేఖలో ఇలా రాసాడు. ''మా బేబీ మార్చి 25న నా పుట్టినరోజుకు కానుక అందించినందుకు చాలా ధన్యవాదాలు

By:  Tupaki Desk   |   22 March 2024 11:20 AM
జాక్విలిన్‌కి మ‌రో ప్రేమ‌లేఖ రాసిన సుకేష్‌
X

కాన్ మేన్ సుకేష్ చంద్రశేఖర్‌ రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ క‌థానాయిక‌ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు నిరంత‌రం హెడ్‌లైన్స్‌లోకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. గత కొంతకాలంగా జైలులో ఉన్న మోసగాడు సుఖేష్‌తో జాకీకి సంబంధం ఉంద‌ని అధికారులు ఆరోపించారు. జైలులో ఉన్నా కానీ.. సుకేష్ నిరంత‌రం త‌న ప్ర‌యురాలికి ప్రేమ లేఖలు పంపుతున్నాడు. త‌న‌పై అప‌రిమిత‌మైన అవిభాజ్య‌మైన ప్రేమ‌ను కురిపిస్తున్నాడు. అతడు త‌న‌ పుట్టినరోజుకు ముందు జాకీ తాజా వీడియో ఆల్బ‌మ్ 'యిమ్మీ యిమ్మీ' పాట ప్రస్తావనతో మరో లేఖను పంపాడు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు రాసిన లేఖలో అతడు హైలైట్ చేసిన 8 ప్రధాన అంశాలు ఇక్కడ ఉన్నాయి.

సుకేష్ చంద్రశేఖర్ లేఖలో ఇలా రాసాడు. ''మా బేబీ మార్చి 25న నా పుట్టినరోజుకు కానుక అందించినందుకు చాలా ధన్యవాదాలు. అయితే నేను దీన్ని నా ప్రారంభ పుట్టినరోజు బహుమతిగా పిలుస్తాను. బేబీ ఇది నా జీవితంలో నేను పొందగలిగే బెస్ట్ గిఫ్ట్. నేను చెబుతున్న బహుమతి మీ కొత్తగా విడుదలైన యిమ్మీ యిమ్మీ పాట. బేబీ, నేను సాంగ్ విని స్టన్ అయ్యాను. పాటలోని ప్రతి పదం, ప్రతి పంక్తి నా గురించి, మన కథ గురించి మొత్తంగా మన గురించి స్పష్టంగా చెబుతోంది. తెలిసి, తెలియక నాకు తెలియదు, కానీ సత్యమే సత్యం. అది అక్కడ స్పష్టంగా ఉంది. ఇది విన్న లేదా విన్న ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను'' అని రాసాడు. ఈ యిమ్మీ యిమ్మీ పాటతో తనను స్టంప్ చేసి, తన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చిందని సుకేష్ లేఖలో అంగీకరించాడు. ప్రజలు మా సంబంధం గురించి చాలా ప్రశ్నలు వేస్తున్నారు. అవాంఛిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు ఈ పాట చేయడం ద్వారా ప్రతి ఒక్కరినీ నిశ్శబ్దంగా మారేలా చేసారు. అందరికీ కావాల్సిన‌ సమాధానం లభించిందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను'' అని కాన్ మాన్ రాసాడు.

ఈ పాటను గ్లామర్‌తో కూడిన మరో కలర్‌ఫుల్ ట్రాక్ కాదని సుకేష్ పేర్కొన్నారు. ఇమ్మీ యిమ్మీ ఒక ప్రేమ గీతం. దీనిలో జాక్వెలిన్ హృదయం, భావాలు, మా ఇరువురి మ‌నోభావాలు ఉన్నాయి. ఇది ఈ సంవత్సరం ప్రేమ గీతం అని అతడు ప‌ర‌వ‌శుడై చెప్పాడు.

సుకేష్ ఇంకా ఇలా అన్నాడు. ''బేబీ నువ్వు నాపై పిడుగులా ప‌డి కొట్టావు.. ఆ పాటలో నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు.. నేను చూసినప్పుడల్లా నా గుండె చప్పుడు మరో స్థాయికి పెరుగుతుంది''అని ప్రేమ‌ను కురిపించాడు. అతను జాక్వెలిన్‌ను మై బెస్ట్ అంటూ మురిసిపోయాడు. ఈ పాటను అందరూ ఇష్టపడి, ఆదరించి, గరిష్ట స్థాయిలో లైక్‌లను అందించి, యూట్యూబ్‌లో ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ సింగిల్‌గా మార్చాలని సుకేష్ కోరారు. సూపర్ స్పెషల్ సాంగ్ అని అన్నాడు.

ఈ పాటకు మాగ్జిమమ్ లైక్స్ వచ్చి హిట్ అయితే, ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్క అభిమానికి ప్రత్యేక బహుమతులు పంపిణీ చేస్తానని చంద్రశేఖర్ తెలిపారు. టాప్ 100 అభిమానులు ఐఫోన్ ప్రోని విన్ అవ్వొచ్చ‌ని దానిని నేను వ్యక్తిగతంగా నిర్ధారిస్తాను అని ప్రామిస్ చేసాడు. యూట్యూబ్‌లో ప్రారంభమయ్యే అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో యిమ్మీ యిమ్మీని సూపర్-డూపర్ హిట్, సాంగ్ సింగిల్ ఆఫ్ ది ఇయర్‌గా ఉండేలా చేయండి అని పిలుపునిచ్చాడు.

సుకేష్ క‌డుపులో చిరుజల్లులు ఆగలేదు. అతడు ఇంకా త‌బ్బి ఉబ్బిపోతూ ఇలా రాసాడు. ''బేబీ మై బొమ్మా.. నీ ఉనికి లేని పుట్టినరోజు ఏ విధంగానూ అస‌లు వేడుక కానే కాదు.. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైనది.. నీ ఈ పాట కారణంగా, నేను తెలిసి, తెలియకుండా, ప్రత్యక్షంగా, పరోక్షంగా, నా పుట్టినరోజు కానుక‌గా వ‌చ్చింది.. నాకు ఒక వేడుక ఇది. త‌న‌ పుట్టినరోజు వేడుక‌కు కొన్ని గంటల ముందు నిరంతరం జాక్వెలిన్‌తో మాట్లాడటం మిస్ అవుతున్నాన‌ని చమత్కరించాడు. జాక్వెలిన్ తనకు అర్ధరాత్రి 12 గంటలకు విష్ చేసేదని, కలిసి కోక్ తాగేవాళ్ల‌మ‌ని వెల్లడించాడు. సుకేష్ ఇలా రాసాడు. నా జీవితంలో మీరు మీ ఉనికి ఉత్తమమైన ఏకైక బహుమతి''అని జ్ఞాప‌కాల్లోకి వెళ్లాడు.

తాను జాక్విలిన్‌ను ఎందుకు అంతగా ప్రేమిస్తున్నాడో వెల్లడిస్తూ సుకేష్ ఇలా రాసాడు. ''జాక్వెలిన్ ప్రేమ నన్ను సజీవంగా ఉంచుతుంది. జాక్వెలిన్ నా శరీరంలోని ప్రతి కణంలో నడుస్తుంది. జాక్వెలిన్ నా గుండె చప్పుడు. జాక్వెలిన్ నా బలం, శక్తి'' అంటూ ఎమోష‌న‌ల్ అయ్యాడు. మళ్లీ మోకాళ్లపైకి వెళ్లేందుకు తాను వేచి ఉండలేనని కూడా చెప్పాడు. జాకీకి ‘హ్యాపీ హోలీ’ అంటూ సుకేష్ లేఖను ముగించాడు. బేబీ హోలీలో ఆడే రంగుల మాదిరిగా మన జీవితం ఎప్పుడూ ఊహించలేనంత సూపర్ కలర్‌ఫుల్‌గా ఉండేలా చూసుకుంటాను. నన్ను నీతో మళ్లీ మళ్లీ ప్రేమలో పడేలా చేయడంలో నువ్వు విఫలం కావు.. అని ప్రేమ‌ను కురిపించాడు. అత‌డి ప్రేమ‌లేఖ ఇప్పుడు వెబ్ లో వైర‌ల్ గా దూసుకెళుతోంది.