Begin typing your search above and press return to search.

జాక్వెలిన్ ని అడ్డంగా బుక్ చేసిన సుకేష్‌!

ఈ నేప‌థ్యంలో తాజాగా జాకీతో జ‌రిపిన వాట్సాప్ చాట్ ని బ‌ట‌య పెట్టాడు. అందులో జాకీ త‌న‌పై చూపించిన ప్రేమ గురించి బ‌హిర్గ‌త‌మైంది. జాకీ స్వ‌యంగా చేతుల‌తో రాసిన కార్డు స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టాడు.

By:  Tupaki Desk   |   4 Jan 2024 12:08 PM GMT
జాక్వెలిన్ ని అడ్డంగా బుక్ చేసిన సుకేష్‌!
X

మ‌నీ లాండ‌రింగ్ కేసులో జైల్లో ఉన్న కాన్ మాన్ సుకేష్ చంద్ర‌శేఖ‌ర్- బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ పెర్నాండేజ్ మ‌ధ్య ఇప్పుడెలాంటి ఎలాంటి స‌న్నివేశం చోటు చేసుకుందో తెలిసిందే. జాకీ -సుకేష్ పై ఎటాకింగ్ దిగ‌డంతో సీన్ మొత్తం రివ‌ర్స్ అయింది. కోర్టులో జాక్వెలిన్ వాగ్ములం ఇవ్వ‌డం...త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన జ‌రిగిన డ్యామేజ్ గురించి కోర్టుకు విన్న‌వించుకోవ‌డంతో సీన్ మొత్తం మారింది. దీంతో సుకేష్ చంద్ర శేఖ‌ర్ అంతే ధీటుగా ఎటాకింగ్ దిగాడు. త‌న‌ద‌గ్గ‌ర ఉన్న ఆధారాల్ని సైతం ఒక్కొక్క‌టిగా బ‌ట‌య పెడుతున్నాడు.

ఈ నేప‌థ్యంలో తాజాగా జాకీతో జ‌రిపిన వాట్సాప్ చాట్ ని బ‌ట‌య పెట్టాడు. అందులో జాకీ త‌న‌పై చూపించిన ప్రేమ గురించి బ‌హిర్గ‌త‌మైంది. జాకీ స్వ‌యంగా చేతుల‌తో రాసిన కార్డు స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టాడు. ఈ చాట్ లో కీల‌క అంశాలున్న‌ట్లు తెలుస్తుంది. ఇద్ద‌రికి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ .. ఆ త‌ర్వాత దాన్ని ప‌ట్టించుకోకుండా సుకేష్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం తెలుస్తుంది. అలాగే షేర్ చేసిన ఆ స్క్రీన్ షాట్ లో.. నేను ఎప్పటికీ మీ దాన్నే.. లవ్ బుట్టబొమ్మ అంటూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రాసిన కార్డును ఉంది.

ఇదే కాదు ఇలాంటి చాట్ లు వాయిస్ రికార్డింగ్ లు..వీడియో కాల్స్ రికార్డింగ్స్ త‌న ద‌గ్గ‌ర ఇంకా చాలా ఉన్న‌ట్లు తెలిపాడు. వాటిని ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీకి అందిస్తాన‌న్నాడు. ఈ కేసులో చాలా వాస్త‌వాలు బ‌య‌ట‌కు తెలియాల‌ని..అవ‌న్ని ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని ఆరోపించాడు. కానీ తాను మాత్రం అన్ని వాస్త‌వాలు బ‌య‌ట‌కు తెస్తాన‌న్నాడు. త‌న ద‌గ్గ‌ర అన్ని ర‌కాల ఆధారాలు ఉన్నాయ‌న్నాడు. జాక్వెలిన్ కి సంబంధించిన వాట్సాప్ చాట్ ఇంత కాలం ర‌హ‌స్యంగా ఉంచాన‌ని ..కానీ ఇక అలాంటి ర‌హ‌స్యా లుండ‌వ‌ని అన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తాన‌న్నాడు.

జాక్వెలిన్ చేతి రాత‌ని స్వ‌యంగా ప‌రిశిలిస్తే చాలా విష‌యాలు తెలుస్తాయ‌ని అన్నాడు. మ‌రి తాజాగా లీకైన అంశంపై జాక్వెలిన్ రియాక్ష‌న్ ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి. 200 కోట్ల మ‌నీ లాండ‌రింగ్ కేసులో జాక్వెలి న్..సుకేష్ నుంచి ఖ‌రీదైన బ‌హుమ‌తులు అందుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కోంటున్న సంగ‌తి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి జాకీ ఇప్ప‌టికే ఈడీ విచార‌ణ కూడా ఎదుర్కుంటుంది.