జాక్వెలిన్ పై కామెంట్ అంతు చూస్తానన్న సుకేష్!
బాలీవుడ్ నటి జాక్వెలిన్ పెర్నాండేజ్ ని గాయకుడు మికాసింగ్ టీజ్ చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 Oct 2023 12:30 AM GMTబాలీవుడ్ నటి జాక్వెలిన్ పెర్నాండేజ్ ని గాయకుడు మికాసింగ్ టీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే నటుడు జీన్ క్లాడ్ వాన్ డామ్ ని జాక్వెలిన్ కలిసిన ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. దీనిపై మికాసింగ్ `నువ్వు అందంగా ఉన్నావ్. సుకేష్ తో పొలిస్తే ఇతను ఇంకా బాగున్నాడని కామెంట్ చేసాడు. తాజాగా ఈ కామెంట్ పై సుకేష్ చంద్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ లేఖ రిలీజ్ చేసాడు.
` మీకా నువ్వు ఏం చేస్తున్నావో నేను చూస్తున్నా. జాక్వెలిన్ కి ఏం బాగుంటుందో చెప్పేటంతటి వాడివా? నువ్వు ఏమని కామెంట్ చేసావో నాకు తెలుసు. ఎదుట వారి గురించి కామెంట్ చేసే ముందు నీ గురించి తెలుసుకో. ఎందుకంటే నా జీవితం ఏంటో అందరికీ తెలుసు. నువ్వు పైకి కనిపించే అంత మంచివాడివి కాదు. మహిళల్ని ఎలా ఇబ్బంది పెడతావో నాకు తెలుసు.
కాబట్టి వేరే వాళ్ల గురించి కామెంట్లు చేసి దిగజారకు. ఇంకెప్పుడు ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వకు. ఇదే రిపీట్ అయితే పర్యవసానాలు మరో విధంగా ఉంటాయి. నీ విషయాలన్ని బయటపెడతా. నువ్వు దివాల తీసే పరిస్థితి వస్తుందని` హెచ్చరించాడు. ఇప్పుడీ లేఖ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. జాక్వెలిన్ కోసం సుకేష్ ఏకంగా యుద్దమే ప్రకటించాడంటూ నెటి జనులు కామెంట్లు చేస్తున్నారు.
సుకేష్ చంద్ర 200 కోట్ల కుంభకోణంలో జైలుపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మండోలి జైలులో ఉన్నాడు. ఇతడితో సంబంధాలు ఉన్నాయి అన్న కారణంగా జాక్వెలిన్ పెర్నాండేజ్ కూడా ఈడీ విచారణ ఎదుర్కుంది. కేసులో ఆమె కూడా కీలకంగా ఉంది. జాక్వెలిన్ కి ఖరీదైన బహుమ తులు..కార్లు..విల్లాలు ఇచ్చినట్లు తేలింది. అయితే సుకేష్ కారణంగా తన జీవితం నాశనమైందని జాక్వెలిన్ పలుమార్లు కన్నీటి పర్యంతం చెందింది. కేసులో భాగంగా వాంగ్ములం ఇచ్చింది. అతనితో కలిసి ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ లోషేర్ చేయోద్దని వేడుకుంది. సుకేష్ చంద్రతో ఇంకా మరికొంత మంది బాలీవుడ్ భామలు రాసలీలలు నెరిపినట్లు ఆరోపణలున్నాయి.