Begin typing your search above and press return to search.

రాజమౌళి థాంక్స్.. ఇంతమంది సుకుమార్ లు కలిసి చేశారు..!

ముందు నా కెరీర్ కు, సినిమాలకు సంబంధించి రాజమౌళి గారికి థాంక్స్ చెప్పాలని అన్నారు సుకుమార్. పుష్ప 1 హిందీలో రిలీజ్ చేయమన్నది ఆయనే.

By:  Tupaki Desk   |   7 Dec 2024 3:31 PM GMT
రాజమౌళి థాంక్స్.. ఇంతమంది సుకుమార్ లు కలిసి చేశారు..!
X

అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేసిన పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా రిలీజైన మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తుంది. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సక్సెస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ ప్రెస్ మీట్ లో సుకుమార్ తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు.

ముందు నా కెరీర్ కు, సినిమాలకు సంబంధించి రాజమౌళి గారికి థాంక్స్ చెప్పాలని అన్నారు సుకుమార్. పుష్ప 1 హిందీలో రిలీజ్ చేయమన్నది ఆయనే. బన్నీని, నిర్మాతలని ఫోన్ చేసి ఒప్పించారు. ఆయనే పట్టుబట్టి రిలీజ్ చేయించారు. అందుకు రాజమౌళి గారు లవ్ యు.. ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే నువ్వు పాన్ ఇండియా రిలీజ్ చేస్తే అది పాన్ ఇండియా సినిమా చేయకపోతే అది తెలుగు సినిమా అన్నారు. సెపరేట్ పాన్ ఇండియా సినిమా ఏది లేదని ఆయన ఇచ్చిన ధైర్యం వల్లే ఇది జరిగిందని అన్నారు సుకుమార్.

సినిమాకు వచ్చిన ఆడియన్ ను 3 గంటలు నా సినిమా ఎంటర్టైన్ చేయాలని అనుకుంటా.. దీనిలో బిజినెస్ యాంగిల్ ఉన్నా 3 గంటలు అన్ని మర్చిపోయి సినిమా చూడాలని అనుకుంటానని అన్నారు సుకుమార్. ఇక సినిమాకు ఫాహద్ ఫాజిల్ చాలా సపోర్ట్ చేశారు. ఇలా డైలాగ్ రాసి ఇస్తే అలా వెంటనే చేశారు. మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహించారు. అలాంటి నటులతో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు సుకుమార్.

ఇక తనతో పనిచేసిన తన దర్శకత్వ శాఖలోని ఒక్కొక్కరి గురించి చెబుతూ సినిమాకు వారు చేసిన పాత్రను చెప్పారు సుకుమార్. ఇంతమంది సుకుమార్ లు కలిసి పుష్ప 2 కి పనిచేశారని అన్నారు. వీరిలో ఏ ఒక్కరు సినిమా తీసినా సరే అద్భుతంగా తీస్తారని.. మీరు కళ్లు మూసుకుని డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేయొచ్చని అన్నారు సుకుమార్. మేమంతా కలిస్తేనే సుకుమార్ ఇది నిజమని అన్నారు.

సినిమా హిందీ వెర్షన్ లో వీరేందర్ సింగ్ షిఖావత్ చాలా హెల్ప్ చేశారని అందుకే హిందీ వెర్షన్ కు అతనికి రచన సహకారం అని వేశామని అన్నారు. హిందీ కాపీ అసలు తాను చూడకుండా రిలీజ్ చేశాం అది అతనిపై నా నమ్మకమని సుకుమార్ అన్నారు. ఇక సినిమాకు పనిచేసిన నవీన్ నూలి ఎడిటింగ్ పర్ఫెక్ట్ అని అందుకే అతను నంబర్ 1 గా ఉన్నారని అన్నారు.

ఒకప్పుడు అమ్మ కాకినాడ వెళ్తానన్నా.. చెన్నై వెళ్తానన్న భయపడేది. ఇప్పుడు నా సినిమా వరల్డ్ వైడ్ గా ఇంత పెద్ద స్థాయిలో ఉందని అన్నారు సుకుమార్. సినిమా 3 ఏళ్లు తీసినా.. 6 ఏళ్లు తీసినా.. ఒక ప్రాణాన్ని ఇవ్వలేము.. ఆ ఇన్సిడెంట్ నా మనసు వికలమైంది. ఆ ఫ్యామిలీకి ఎప్పుడు తోడుగా ఉంటామని అన్నారు సుకుమార్.