శిష్యుల్ని గర్వంగా పరిచయం చేసిన ఒకే ఒక్కడు!
సుకుమార్ శిష్యలుంటే? బుచ్చిబాబు, సూర్య ప్రతాప్ మాత్రమే కాదు. సుకుమార్ బ్రాండ్ తో ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటోన్న వారెంతో మంది ఉన్నారు.
By: Tupaki Desk | 15 Dec 2024 12:30 PM GMTపాన్ ఇండియా మేకర్ సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్లకు, రైటర్లకు ఎంత ప్రాధన్యత ఇస్తారు? అన్నది చాలా సందర్భా ల్లో రుజువైంది. సుకుమార్ కాంపౌండ్ వదిలి వచ్చిన అసిస్టెంట్లు అంతా నేను సుకుమార్ శిష్యుడని గర్వంగా చెప్పుకుని సినిమాలు చేస్తున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. సుకుమార్ శిష్యలుంటే? బుచ్చిబాబు, సూర్య ప్రతాప్ మాత్రమే కాదు. సుకుమార్ బ్రాండ్ తో ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటోన్న వారెంతో మంది ఉన్నారు. అసిస్టెంట్ల అందరి పేర్లను సుకుమార్ గుర్తించలేకపోచ్చు.
కానీ సుకుమార్ దగ్గర పనిచేసిన ప్రతీ అసిస్టెంట్ ఆయన్ని గొప్ప గురువుగానే భావించి ముందుకెళ్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఆయన శిష్యలుకు ఇచ్చిన ప్రాధాన్యత ఒకటైతే? సుకుమార్ దగ్గర నేర్చుకున్న విధానం.. ఆయన నేర్పిన విధానం అన్నది గురువుకు అంత గొప్ప స్థానం కల్పించింది. ఇటీవలే 'పుష్ప2' ప్రమోషన్ లో భాగంగా ఆ సినిమాకు పనిచేసిన కొంత మంది అసిస్టెంట్లను సుకుమార్ స్వయంగా మీడియాకు, ప్రజలకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
ఒక్కొక్కరి ప్రతిభ గురించి సుకుమార్ స్వయంగా వివరించారు. సెట్స్ లో వాళ్ల పనితనం ఎలా ఉంటుందో గొప్పగా చెప్పారు. ఓ స్టార్ డైరెక్టర్ తన అసిస్టెంట్ గురించి ఇలా గొప్పగా చెప్పాలంటే గుండె ధైర్యం ఉండాలి. అది సుకుమార్ లో ఉందని నిరూపించారు. సాధారణంగా ఇండస్ట్రీలో చాలా మంది అభద్రతా భావంతో ఫీలవుతారనే విమర్శ ఉంది. తన కిందోడు ఎదిగితే తన కెరీర్ కి ఎక్కడ ప్రమాదం ఎర్పడుతుందోనన్న అభద్రతా భావం కొందరి స్టార్ డైరెక్టర్ లో ఉంటుందని తరుచూ వినిపిస్తుంటూ ఉంటుంది.
అందుకే కొందరు దర్శకులు అసలు అసిస్టెంట్ అంటే కనీసం స్టేజ్ కూడా ఎక్కనివ్వరు. వాళ్ల పేరు కూడా చెప్పరు. కానీ సుకుమార్ అలాంటి డైరెక్టర్ కాదు. తనతో పాటు తన కిందనున్న వాళ్లు కూడా ఎదగాలి అనుకునే గొప్ప మనస్త త్వం ఉన్న డైరెక్టర్. ఆయన వద్ద పనిచేయాలంటే ప్రతిభ ఉంటే సరిపోతుంది. ఇంకెలాంటి సర్టిఫికెట్లు అవసరం లేదని ఆయన వద్ద పనిచేసిన శిష్యులే చెబుతున్నారు. ఇది సుకుమార్ కి ఎంతో గర్వకారణం. ఇండస్ట్రీలో గొప్ప శిష్యుల్ని తయారు చేసిన చరిత్ర సుకుమార్ కే సొంతం.