Begin typing your search above and press return to search.

సుకుమార్ - ఎన్టీఆర్.. ఓకే కానీ..

ఇలా వీరిద్దరూ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కంప్లీట్ కావడానికి మరో మూడేళ్లు పట్టొచ్చు.

By:  Tupaki Desk   |   18 Aug 2023 5:30 PM GMT
సుకుమార్ - ఎన్టీఆర్.. ఓకే కానీ..
X

జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ గా ఫ్రెంచ్ గెడ్డంతో ఆకట్టుకున్నాడు. అలాగే ఇంటరెస్టింగ్ వేలో సాగిన ఈ మూవీ కథ కూడా కొత్తదనంతో ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. ఇంటలెక్చువల్ ఉపయోగించి చేసిన కూడా సుకుమార్ సామాన్యులకి అర్ధమయ్యే రీతిలో కంటెంట్ ని చెప్పి సక్సెస్ అయ్యారు.

దీని తర్వాత సుకుమార్ కంప్లీట్ గా జోనర్ మార్చేసి రంగస్థలం మూవీతో మరో బ్లాక్ బస్టర్ కొట్టారు. మాస్ మానియాని అర్ధం చేసుకొని నెక్స్ట్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో హిట్ కొట్టారు. ఇప్పుడు పుష్ప 2ని చెక్కే పనిలో సుకుమార్ ఉన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివతో దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

మరల వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందనే ప్రచారం తెరపైకి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ లో వీరి మూవీ ఉండబోతోందంట. కథని కూడా ఇప్పటికే సిద్ధం చేసిన సుకుమార్ దానిని వినిపించే పనిలో ఉన్నారని టాక్. అయితే ప్రస్తుతం సుకుమార్ మూవీ లైన్ అప్ చూసుకుంటే పుష్ప 2 తర్వాత రామ్ చరణ్ ఉన్నారు. ఇప్పటికే అతనితో నెక్స్ట్ మూవీకి సంబంధించి ట్రయిల్ షూట్ కూడా చేసినట్లు గతంలో చెప్పారు.

తరువాత విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఎప్పుడో దానిని ఎనౌన్స్ చేశారు. ఆ మూవీ తర్వాతనే ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ ఉంటుంది. ఇటు ఎన్టీఆర్ కూడా దేవర తర్వాత వార్ 2 మూవీ చేయనున్నారు. అది కంప్లీట్ చేసి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు. ఇలా వీరిద్దరూ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కంప్లీట్ కావడానికి మరో మూడేళ్లు పట్టొచ్చు.

ఆ తరువాతనే ఎన్టీఆర్, సుకుమార్ కాంబోలో మూవీ ఉండే ఛాన్స్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల మాట. అప్పటికి ఎవరి రేంజ్ ఎలా ఉంటుందో, ఎలాంటి కాన్సెప్ట్ తో సినిమా చేస్తారనేది ఇప్పుడే చెప్పలేని విషయం. ఒక వేళ ఏదైనా స్టోరీ అనుకున్న కేవలం లైన్ మాత్రమే ఒకే అయ్యే ఛాన్స్ ఉంది. స్క్రిప్ట్ ని అప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది.