ఇంటర్వల్ బ్లాక్ బస్టర్.. సెకండ్ హాఫ్ గూస్ బంప్స్ నేషనల్ అవార్డ్ పక్కా..!
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ డల్లాస్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి సుకుమార్ స్పెషల్ గెస్ట్ గా వెళ్లారు.
By: Tupaki Desk | 29 Dec 2024 8:53 AM GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ డల్లాస్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి సుకుమార్ స్పెషల్ గెస్ట్ గా వెళ్లారు.
గేమ్ ఛేంజర్ డల్లాస్ ఈవెంట్ లో సుకుమార్ స్పీచ్ ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. ముందుగా మైక్ అందుకున్న సుకుమార్ 1 సినిమాను గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా ఇక్కడ కలెక్ట్ చేయకపోతే తాను సినిమాలు తీసి ఉండే వాడిని కాదని అన్నారు. ఇక తనకు మొదటి సినిమా ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు గారికి థాంక్స్. ఇప్పుడు కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడం ఈజీనే కానీ అప్పట్లో చాలా డౌట్ పడే వాళ్లు.. ఎప్పుడు చెప్పినా కూడా మళ్లా మళ్లీ చెబుతాను ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేని అన్నారు సుకుమార్.
ఇక శంకర్ గురించి చెబుతూ.. ఆయన చేతిలోనే ఫస్ట్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నా.. మీ సినిమాలు చూస్తూ పెరిగామని అన్నారు సుకుమార్. తాను అసిస్టెంట్ గా చేస్తున్న టైం లో చిరంజీవి గారితో శంకర్ ఎందుకు సినిమా చేయరని అనుకున్నా చరణ్ తో తీస్తున్నారని తెలిసి ఆనందపడ్డానని అన్నారు సుకుమార్. థాంక్ యు సర్ తెలుగులో ఈ సినిమా చేసినందుకని అన్నారు.
సూర్య గురించి చెబుతూ.. ఖుషికి నేను చాలా పెద్ద ఫ్యాన్.. ఆ సినిమా తో తాను సీన్స్ ఎలా తీయాలో చూసి నేర్చుకున్నా అన్నారు సుకుమార్. ఇక తమన్ తనకు క్లిస్ట పరిస్థితుల్లో వచ్చాడు.. కానీ నేను యూజ్ చేసుకోలేదని అన్నారు సుకుమార్. తాను చేసిన ప్రతి సినిమా హీరోని ప్రేమిస్తాను.. ఎప్పుడు సినిమా పూర్తయ్యాక వేరే ఎవరితో కనెక్ట్ లో ఉండను.. కానీ చరణ్ తో ఆ అనుబంధం కొనసాగుతుంది. నాకు చాలా ఇష్టమైన బ్రదర్ అని అన్నారు సుకుమార్.
తను ఆల్రెడీ చిరంజీవితో సినిమా చూశాను.. ఫస్ట్ హాఫ్ ఆసం.. ఇంటర్వల్ బ్లాక్ బస్టర్.. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్. శంకర్ గారి జెంటిల్మన్, భారతీయుడు చూసి ఎంత ఎంజాయ్ చేశానో ఈ సినిమా చూసి అంత ఎంజాయ్ చేశానని అన్నారు సుకుమార్. చరణ్ చేసిన రంగస్థలం కి నేషనల్ అవార్డ్ వస్తుందని అనుకున్నాం.. ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే ఈసారి కూడా అదే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే నేషనల్ అవార్డ్ వస్తుందని అన్నారు సుకుమార్.. ఇంత మంచి సినిమా చేసినందుకు శంకర్ గారు థాంక్యు అని అన్నారు సుకుమార్.