సుకుమార్.. ఆ సినిమాతో గుడ్ బై చెప్పాలని..
పాన్ ఇండియా లెవెల్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తన అప్ కమింగ్ చిత్రాల వైపు అందరి దృష్టిని తిప్పుకున్నారు.
By: Tupaki Desk | 30 Dec 2024 7:10 AM GMTటాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో సుకుమార్ కచ్చితంగా ఉంటారన్న విషయం తెలిసిందే. రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు పుష్ప-2 సిరీస్ చిత్రాలతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయారు. పాన్ ఇండియా లెవెల్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తన అప్ కమింగ్ చిత్రాల వైపు అందరి దృష్టిని తిప్పుకున్నారు.
అయితే అల్లు అర్జున్ తో చేసిన ఆర్య మూవీతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన సుకుమార్.. డెబ్యూ సినిమాతో వేరే లెవెల్ హిట్ అందుకున్నారు. లవ్ స్టోరీని అలా కూడా తీయోచ్చా అనే క్వశ్చన్ చేసేలా మెప్పించారు. రెండో సినిమా రామ్ తో జగడం చేసిన లెక్కల మాస్టర్.. బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో సుక్కూ.. వన్ నేనొక్కడినే మూవీ తీసిన విషయం తెలిసిందే. హాలీవుడ్ స్టైల్ లో తీసిన ఆ సినిమాను ఓ మాస్టర్ పీస్ అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం మూవీ అర్థం కాలేదని చెబుతుంటారు. ఏదేమైనా వన్ నేనొక్కడినే మూవీ.. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా నిరాశపరిచింది.
అయితే ఆ సినిమా తర్వాత తాను ఇక మూవీస్ తీయడం ఆపేస్తా అనుకున్నానని సుకుమార్ తాజాగా తెలిపారు. అమెరికాలో ఆ మూవీ మంచి వసూళ్లు సాధించకపోయి ఉండే.. గుడ్ బై చెప్పేసేవాడినని అన్నారు. ఈ మేరకు అమెరికాలోని డల్లాస్ లో జరిగిన గేమ్ ఛేంజర్ ఈవెంట్ లో సుకుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
నేనొక్కడినే తర్వాత ఆల్మోస్ట్ సినిమాలు ఆపేద్దాం అన్నట్టుగా తన పరిస్థితి మారిందని ఆ రోజులు గుర్తు చేసుకున్నారు సుకుమార్. కానీ తాను తన కెరీర్ ను మళ్లీ కొనసాగించడానికి కారణం అమెరికాలో ఆ మూవీకి వచ్చిన వసూళ్లు మాత్రమేనని చెప్పారు. యూఎస్ ఆడియన్స్ వల్ల తాను ఇప్పుడు ఇలా ఉన్నానని తెలిపారు.
అందుకే వారందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు సుకుమార్. అయితే సుక్కూ కామెంట్స్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఆయన టాలెంట్ ఏంటో అందరికీ తెలుసని చెబుతున్నారు. పుష్ప సిరీస్ చిత్రాలతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ను షేక్ చేశారని గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పి ఉంటే.. ఎన్నో జెమ్స్ ను మిస్ అయ్యేవాళ్లమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.