Begin typing your search above and press return to search.

మొహమాటానికి సినిమా చేయొద్దు.. నమ్మకం లేదు కానీ..!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈమధ్యనే పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఐతే డైరెక్టర్ గా సుకుమార్ ఎంత గొప్ప దర్శకుడైనా ఇంట్లో తానొక సాధారణ తండ్రి

By:  Tupaki Desk   |   17 Jan 2025 8:00 PM GMT
మొహమాటానికి సినిమా చేయొద్దు.. నమ్మకం లేదు కానీ..!
X

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈమధ్యనే పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఐతే డైరెక్టర్ గా సుకుమార్ ఎంత గొప్ప దర్శకుడైనా ఇంట్లో తానొక సాధారణ తండ్రి. కూతురు సినిమాల మీద ఆసక్తి చూపించడం అతన్ని ఆశ్చర్యపరచింది. సుకుమార్ కూతురు సుకృతి లీడ్ రోల్ లో పద్మ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా గాంధి తాత చెట్టు. ఈ సినిమా ఈవెంట్ లో సుకుమార్ స్పీచ్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.

సుకృతికి సింగింగ్ అంటే చాలా ఇష్టం.. నటన మీద ఆసక్తి లేదు. కానీ డైరెక్టర్ పద్మ, ప్రొడ్యూసర్ సింధు ఆమెను ఒప్పించారు. ఈ సినిమా విషయంలో వారిద్దరిది పెద్ద జర్నీ. సుకృతి నటిస్తుందని తాను ఎప్పుడు అనుకోలేదని.. నాకు ఆ నమ్మకం లేదని అన్నారు సుకుమార్. పద్మ అడగడంతో సుకృతి ఒప్పుకుంది. ఐతే మొహమాటానికి సినిమా చేయకని చెప్పానని సుకుమార్ అన్నారు. ఐతే సినిమాలో సుకృతి యాక్టింగ్ చూశాక షాక్ అయ్యాను. తను చాలా బాగా నటించింది.

కూతురు బాగా చేసింది కాబట్టి బాగా చేసింది అని చెప్పడానికి ఏమాత్రం సందేహించనని అన్నారు సుకుమార్. పద్మ సింధు ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. తన దృష్టిలో కథ బాగా చెప్పగలిగితే సినిమా బాగా తీయగలరని అనుకుంటా. దర్శకురాలు కథ బాగా చెప్పడమే కాదు అదే విధంగా సినిమా తీసిందని అన్నారు సుకుమార్. ఐతే ఈ సినిమా సుకృతి లైఫ్ లో ఒక మంచి జ్ఞాపకంగా ఉంటుందని అన్నారు సుకుమార్.

ఇక తన సినిమాల గురించి చెబుతూ 3 గంటలు మనుషులను కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేయగలిగితే ఆ 3 గంటలు క్రైం తగ్గుతుందని భావిస్తా అన్నారు సుకుమార్. ఎంటర్టైన్మెంట్ మెసేజ్ గా ఫీల్ అవుతానని అన్నారు. సినిమా అంటే బిజినెస్.. ఎలాంటి ఇన్వెస్ట్ చేసినా అది బిజినెస్ అవుతుందని.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కాదు మెసేజ్ ఇచ్చే సినిమా చేయడం కూడా గొప్ప అదృష్టమే.. గాంధి తాత చెట్టులో అటు ఎంటర్టైన్మెంట్.. మెసేజ్ రెండూ ఉన్నాయి. ఈ సినిమాను అందరు ఆదరించాలని కోరుతున్నా అంటూ కూతురు సినిమాలో లాంగ్ స్పీచ్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు సుకుమార్.