Begin typing your search above and press return to search.

టీవీ9 దేవి టాలెంట్ పై సుకుమార్ ఎలివేషన్స్

'పుష్ప 2' కి ఆమె సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరింది.

By:  Tupaki Desk   |   8 Dec 2024 4:50 AM GMT
టీవీ9 దేవి టాలెంట్ పై సుకుమార్ ఎలివేషన్స్
X

టీవీ 9లో న్యూస్ రీడర్ గా అందరికి సుపరిచితం అయిన జర్నలిస్టు దేవి నాగవల్లి. ఆమె న్యూస్ యాంకర్ గా ప్రత్యేకమైన మాడ్యులేషన్ తో వార్తలు ప్రెజెంట్ చేస్తూ పాపులర్ అయ్యింది. తరువాత 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షోలో కూడా పాల్గొనే అవకాశం సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె లైఫ్ లో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. 'పుష్ప 2' కి ఆమె సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరింది.

తాజాగా జరిగిన 'పుష్ప 2' సక్సెస్ మీట్ తో సుకుమార్ తన అసిస్టెంట్ లు అందరిని స్టేజ్ మీదకి పిలిచి వారి టాలెంట్ ని పరిచయం చేశారు. అలాగే దేవి నాగవల్లి గురించి కూడా మాట్లాడారు. ఈ సినిమాకి దేవి నాగవల్లి జర్నలిస్ట్ ఇన్ పుట్స్ చాలా ఉపయోగపడ్డాయని చెప్పారు. అలాగే దేవి జర్నలిస్ట్ గా తాను రీసెర్చ్ చేసిన కొన్ని కథలు గురించి చెబితే నాకే షాకింగ్ గా అనిపించింది. ఏ మూలకి వెళ్లిన కథ దొరుకుతుంది.

ఆమె దగ్గర చాలా కథలు ఉన్నాయి. నాకు తెలిసి ఆమె జర్నలిజం జాబ్ కూడా వదిలేసినట్లు తెలుస్తోంది. డైరెక్షన్ ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది. అన్ని కుదిరితే ఆమె కథతో ఒక సినిమా నేను చేయొచ్చు అని సుకుమార్ స్టేజ్ పైన చెప్పుకొచ్చారు. ఆమె తన జర్నలిజం కెరీర్ లో ఉన్న అనుభవాలను మొత్తం కూడా కలిపి ఎన్నో కథలను రాజుకుంది.

సుకుమార్ ద్వారా దేవి నాగవల్లి రూపంలో మరో టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ త్వరలో టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతోందని అర్ధమవుతోంది. అయితే ఆమెని దర్శకురాలిగా ఎవరు పరిచయం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్ని కుదిరితే సుకుమార్ తన బ్యానర్ లో దేవి నాగవల్లిని దర్శకురాలిగా పరిచయం చేసే ఛాన్స్ ఉండొచ్చు.

ఒక వేళ ఆమె దర్శకురాలిగా పరిచయం అయితే ఎలాంటి కథలతో మూవీస్ చేస్తుందనేది ఇప్పుడు అందరికి ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. టీవీ9 న్యూస్ యాంకర్ గా ఆమె సక్సెస్ అందుకొని విశేషమైన గుర్తింపు సొంతం చేసుకుంది. విశ్వక్ సేన్ కు సంబంధించిన కాంట్రవర్సీ తో దేవి నాగవల్లి అందరి దృష్టిని ఆకర్షించింది.