ఆ రకంగా పాన్ ఇండియాని కొట్టిన ఒకే ఒక్కడు!
కేవలం కంటెంట్ తో మాత్రమే ప్రేక్షకుల్ని ఆకర్షించిన దర్శకుడిగా తన కంటూ ప్రత్యేకమైన ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.
By: Tupaki Desk | 20 Dec 2024 5:30 PM GMTడైరెక్టర్ సుకుమార్ ఇప్పుడో సంచలనం. పాన్ ఇండియాలో గ్రేట్ డైరెక్టర్ గా నీరాజనాలు అందుకుంటున్నాడు.'పుష్ప-2' తో ఖాన్ లు..కపూర్ ల రికార్డులను సైతం తిరగరాసిన డైరెక్టర్. అత్యంత వేగంగా 1500 కోట్ల క్లబ్ లో చేర్చిన దర్శకుడిగా రికార్డు సృష్టించాడు. కేవలం కంటెంట్ తో మాత్రమే ప్రేక్షకుల్ని ఆకర్షించిన దర్శకుడిగా తన కంటూ ప్రత్యేకమైన ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. సినిమా కోసం అతడు భారీగానూ నిర్మాతలతో ఖర్చు చేయించలేదు. ఆ సినిమా బడ్జెట్ 300 కోట్ల మధ్యలోనే ఉంటుందని అంచనా.
దీనికి సంబంధించి అధికారిక లెక్కలు లేనప్పటికీ కంటెంట్ చూస్తే ఇదీ హెవీ బడ్జెట్ సినిమా కాదని అర్ద మవుతుంది. సినిమా కోసం టాప్ స్టార్లను రంగంలోకి దించలేదు. బాలీవుడ్ మార్కెట్ కోసం హిందీ నటుల్ని దిగుమతి చేయలేదు. పహాద్ పాజల్ మినహా మిగతా అందర్నీ తెలుగు నటుల్ని పెట్టుకునే ఇండియాని షేక్ చేసాడు. హాలీవుడ్ టెక్నీషి నయన్లను తీసుకు రాలేదు. సినిమాలో గ్రాఫిక్స్ లేవు. మరి ఇవేమి లేకుండా సక్సస్ ఎలా అయిందంటే? కేవలం కథాబలం, పాత్రలతో మాత్రమే వండర్ క్రియేట్ చేసాడు.
ఇది కేవలం సుకుమార్ కి మాత్రమే పాన్ ఇండియాలో చెల్లిందని నిరూపించాడు.'పుష్ప' కంటే ముందు రాజమౌళి'బాహుబలి',' ఆర్ ఆర్ ఆర్' చిత్రాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.'బాహుబలి' చిత్రాన్ని భారీ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. అందులో భారీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్స్ట్, స్టార్ నటీనటులు, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, భారీతనం, కోట్ల రూపాయల బడ్జెట్ ఇలా చాలా ఉంటుంది.'బాహు బలి' కథకి ఇవన్నీ అవసరం. అలాగే'ఆర్ ఆర్ ఆర్' సినిమాకు ఇదే భారీతనం కనిపించింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు నటుల, బ్రిటీష్ సామ్రాజ్యం కోసం ప్రత్యేకమైన సెట్లు, హాలీవుడ్ టెక్నీషియన్లు, విదేశీ నటులు ఇలా ఎంతో భారీ కాన్వాస్'ఆర్ ఆర్ ఆర్' లో కనిపిస్తుంది.
ఇక నాగ్ అశ్విన్ నుంచి రిలీజ్ అయిన'కల్కి 2898'గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండియా నుంచి రిలీజ్ అయిన మొట్ట మొదటి హై స్టాండర్స్డ్ టెక్నికల్ చిత్రమిది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కోసం ప్రత్యేకమైన ప్రపంచాన్నే సృష్టిం చారు. ప్రతీ ప్రేమ్ లోనూ ఖర్చు కనిపిస్తుంది. హాలీవుడ్ టెక్నీషియన్లు అక్కడ స్టాండర్స్డ్ కి ఏమాత్రం తగ్గకుండా రూపొందించిన చిత్రమిది. ఈ మూడు సినిమాల్ని'పుష్ప' చిత్రంతో ముడి పెట్టి వసూళ్ల పరంగా మాట్లాడితే? 'పుష్ప' నెంబవర్ స్థానంలో ఉందిప్పుడు. ఆ సినిమాల బడ్జెట్ తో పోలిస్తే పుష్పకి అయిన బడ్జెట్ కూడా చాలా తక్కువ. అదీ సంగతి.