Begin typing your search above and press return to search.

ఆ సినిమాలో బ‌న్నీ హీరో అంటే న‌వ్వారు!

ఇటీవ‌ల రిలీజ్ అయిన 'పుష్ప‌-2' తో వ‌రుస‌గా నాలుగు విజ‌యాలు న‌మోద‌య్యాయి.

By:  Tupaki Desk   |   10 Dec 2024 3:53 AM GMT
ఆ సినిమాలో బ‌న్నీ హీరో అంటే న‌వ్వారు!
X

బ‌న్నీ-సుకుమార్ కాంబినేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ క‌ల‌యిక‌లో ఫెయిల్యూర్ అనేది లేదు. ఇప్ప‌టికే హ్యాట్రిక్ న‌మోదు చేసారు. 'ఆర్య‌', 'ఆర్య‌-2', ''పుష్ప‌' ది రైజ్' తో హ్యాట్రిక్ న‌మోదు చేసారు. దీంతో ఈ ద్వ‌యం డ‌బుల్ హ్యాట్రిక్ పై క‌న్నేసింది. ఇటీవ‌ల రిలీజ్ అయిన 'పుష్ప‌-2' తో వ‌రుస‌గా నాలుగు విజ‌యాలు న‌మోద‌య్యాయి. బ‌న్నీ స్టార్ అయ్య‌డ‌న్నా? పాన్ ఇండియా స్టార్ గా అవ‌త‌రించాడా? అందుకు కార‌ణం సుకుమార్. ఈ విష‌యాన్ని బ‌న్నీ పబ్లిక్ గానే ఓపెన్ అయ్యాడు.

భ‌విష్య‌త్ లో మ‌రిన్ని సంచ‌నాలు ఈ కాంబినేష‌న్ లో ఉంటాయి. తాజాగా బ‌న్నీ గురించి సుకుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. 'నా డార్లింగ్ పుష్ప‌రాజ్ కి జాతీయ అవార్డు రావాల‌ని క‌ల‌లు క‌న్నా. అది నా సినిమాకే వ‌చ్చినందుకు గ‌ర్వంగా ఉంది. త‌ను నాకు ప్రెండ్ అనే కంటే దేవుడు అంటే బాగుంటుంది. బ‌న్నీ లోప‌ల ఓ ఫిలాస‌ఫ‌ర్ దాగి ఉన్నాడు. ఏ విష‌యాన్ని అయినా ఎంతో లోతుగా ఆలోచిస్తాడు. అలాంటి న‌టుడు నాకు దొర‌క‌డం అదృష్టం.

త‌న‌ని ఆర్య‌లో హీరోగా తీసుకుంటాను అంటే మొద‌ట చాలా మంది న‌వ్వారు. వ‌ద్దని స‌ల‌హాలు ఇచ్చారు. అదే స‌మ‌యంలో బన్నీ ఓ కార్య‌క్ర‌మానికి వ‌చ్చాడు. అక్క‌డ బ‌న్నీ ఎంతో హుషారుగా స‌ర‌దాగా ప‌ల‌క‌రిస్తూ మాట్లాడు తున్నాడు. ఆప్యాయంగా ప‌ల‌క‌రించుతాడు. ఆ క్ష‌ణంలో త‌న‌లో నాకు 'ఆర్య' క‌నిపించి ఎంత మంది వ‌ద్ద‌న్నా ఆ పాత్ర‌కి బ‌న్నిని తీసుకున్నా. అప్ప‌టి నుంచి మా ప్ర‌యాణం అన్ స్టాప‌బుల్ అని చెప్పాలి' అని అన్నారు.

ప్ర‌స్తుతం 'పుష్ప‌-2' టీమ్ సినిమా స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవ‌ల గ్రాండ్ గా విజ‌యోత్స‌వ వేడుక‌ను నిర్వ హించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా సాధిస్తున్న వ‌సూళ్ల‌ను అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే చిత్రం 800 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించిన సంగ‌తి తెలిసిందే.