Begin typing your search above and press return to search.

పుష్ప-2 తర్వాత ఆరు నెలలు బ్రేక్‌!

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందిన పుష్ప 2 సినిమా డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By:  Tupaki Desk   |   25 Nov 2024 7:30 AM GMT
పుష్ప-2 తర్వాత ఆరు నెలలు బ్రేక్‌!
X

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందిన పుష్ప 2 సినిమా డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న పుష్ప 2 సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు అన్ని పూర్తి అయ్యాయి. పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ ఒకటి రెండు రోజుల్లో పూర్తి అయ్యి సినిమా సెన్సార్‌ కి వెళ్లబోతుంది. దర్శకుడు సుకుమార్‌ రోజులో 20 గంటలు పుష్ప 2 సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ పర్యవేక్షిస్తూ ఉన్నారని తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు సినిమా షూటింగ్‌తో సుకుమార్‌ బిజీగా ఉన్నారు.

సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ ఏమాత్రం తేడా రాకూడదు అనే ఉద్దేశ్యంతో తానే దగ్గర ఉండి అన్ని పనులు చేస్తున్నారు. అందుకే బీహార్‌లో జరిగిన ఈవెంట్‌కి, చెన్నైలో జరిగిన ఈవెంట్‌కి సుకుమార్ హాజరు కాలేదు. ఇప్పటి వరకు సుకుమార్‌ సినిమా కోసం చాలా బిజీ బిజీగా ఉన్నారు. పుష్ప పార్ట్‌ 1 ప్రారంభం అయినప్పటి నుంచి అంటే దాదాపుగా నాలుగు ఏళ్ల నుంచి సుకుమార్‌ పుష్ప.. పుష్ప.. అంటూ మరో మాట లేకుండా వర్క్ చేస్తున్నారు. అందుకే పుష్ప 2 రిలీజ్ తర్వాత కనీసం ఆరు నెలలకు తగ్గకుండా బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నాడట. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఆయన ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

యూఎస్‌లో సుకుమార్‌ దాదాపు ఆరు నెలల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారని తెలుస్తోంది. అదే సమయంలో రామ్‌ చరణ్ తో చేయబోతున్న స్క్రిప్ట్‌ పై అడపా దడపా వర్క్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి నాలుగు ఏళ్లుగా కష్టపడుతున్న సుకుమార్‌ లాంగ్‌ బ్రేక్ తీసుకుని ఫ్రెష్‌గా రామ్‌ చరణ్ సినిమా కోసం రెడీ కాబోతున్నారు. అతి త్వరలోనే సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సుకుమార్‌ చాలా రిలాక్స్ కాబోతున్నారు. డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న పుష్ప 2 సినిమాకి రూ.2000 కోట్ల వసూళ్లు నమోదు కావడం ఖాయం అనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో రూ.400 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఇప్పుడు హిందీ వర్షన్‌ పుష్ప 2 ఏకంగా రూ.1000 కోట్ల వసూళ్ల టార్గెట్‌తో విడుదల కాబోతుంది. తమిళ్‌ లో రూ.100 కోట్ల, కన్నడ, మలయాళంలో రూ.50 కోట్ల చొప్పున వసూళ్లు చేయాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సాధించబోతున్న వసూళ్లపై ఏ ఒక్కరు ఊహించలేక పోతున్నారు. సినిమా టికెట్ల పెంపుపై వసూళ్లు ఆధారపడి ఉంటాయి. మొదటి వీకెండ్‌ పూర్తి అయ్యేప్పటికి సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. అదే నిజమైతే దంగల్‌, బాహుబలి 2 రికార్డ్‌లు గల్లంతు కావడం ఖాయం.