Begin typing your search above and press return to search.

బన్నీపై ప్రేమే 'పుష్ప' మూవీస్.. అందుకు ఆయనే కారణం: సుకుమార్

ఆ సమయంలో తన వ్యాఖ్యలతో సుకుమార్ అందరి దృష్టిని ఆకర్షించారు. అల్లు అర్జున్‌ పై తనకున్న ప్రేమే పుష్ప చిత్రాలని తెలిపారు.

By:  Tupaki Desk   |   3 Dec 2024 4:10 AM GMT
బన్నీపై ప్రేమే పుష్ప మూవీస్.. అందుకు ఆయనే కారణం: సుకుమార్
X

జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ పుష్ప 2. ఇప్పటికే అన్ని పనులు పూర్తి కాగా.. మేకర్స్ నిన్న రాత్రి హైదరాబాద్ లో భారీ వైల్డ్ ఫైర్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆ సమయంలో తన వ్యాఖ్యలతో సుకుమార్ అందరి దృష్టిని ఆకర్షించారు. అల్లు అర్జున్‌ పై తనకున్న ప్రేమే పుష్ప చిత్రాలని తెలిపారు.

తాను అలిసిపోయి ఉన్నానని, కానీ ఒక్కటి మాత్రం నిజమంటూ పవర్ ఫుల్ గా స్పీచ్ ను స్టార్ట్ చేశారు సుకుమార్. బన్నీతో తన జర్నీ ఆర్యతో స్టార్ట్ అయిందని తెలిపారు. అల్లు అర్జున్ ఒక వ్యక్తిగా.. ఆర్టిస్ట్ గా ఎలా ఎదుగుతున్నారో దగ్గరి నుంచి చూశానని చెప్పారు. చెప్పాలంటే... పుష్ప1, పుష్ప2 చిత్రాలు ఇలా రెడీ అయ్యాయంటే తన మీద ప్రేమ మాత్రమేనని అన్నారు.

"మా బాండింగ్ అనేది ఎనర్జీ ఎక్స్చేంజ్. తనతో మాట్లాడుతున్నప్పుడు.. ఒక సీన్ చెబుతున్నప్పుడు.. ఎనర్జీ ఇస్తుంటారు. సీన్ రావాల్సిన సమయంలో ఒక చిన్న ఎక్స్‌ప్రెషన్‌ కోసం పోరాటం చేస్తూనే ఉంటారు. ఒక స్టార్ పడే తపన వల్ల డైరెక్టర్ కు చాలా ఎనర్జీ వస్తుంది. అల్లు అర్జున్ కోసమే పుష్ప సినిమాలు చేశాను. ఆయనపై ప్రేమతోనే మూవీలు చేశా" అని సుకుమార్ తెలిపారు.

"బన్నీ.. నిన్ను కలవడానికి వచ్చినప్పుడు నా దగ్గర అస్సలు కథ లేదు. కేవలం రెండు సీన్స్ చెప్పా. కానీ నీవు పడే తపన వల్ల ఈ వ్యక్తి కోసం ఏదైనా చేయొచ్చని అనిపించింది. నీకు సినిమానే ప్రపంచం. ఆయన వల్ల అందరికీ ఎనర్జీ వస్తుంది. ఒక స్థాయిలో ప్లాట్ ఫామ్ క్రియేట్ చేశారు. ఆ హైట్ లో అందరూ వర్క్ చేయాలి.. లవ్ యూ" అని సుక్కూ చెప్పారు.

ఇది కథ కాదు.. సినిమా కాదు.. కేవలం అల్లు అర్జున్‌ పట్ల ప్రేమ మాత్రమేనని తెలిపారు. అల్లు అర్జున్ మూవీ కోసం మూడేళ్లు కష్టపడ్డారని అన్నారు. ఒక వ్యక్తి జీవితంలో ప్రైమ్ టైమ్ తీసుకున్నట్లు చెప్పారు. పుష్ప 3.. అంటూ ఆడియన్స్ అరవగా.. అది తీయాలంటే హీరో మరో మూడేళ్లు ఇస్తాడేమో అడగాలని నవ్వేశారు. ఫ్యాన్స్ ను తమ హీరోను అడగమని అన్నారు.

పుష్ప ప్రొడ్యూసర్స్ మంచి ప్లాట్ ఫామ్ క్రియేట్ చేశారని కొనియాడారు. నవీన్ గారు, రవి గారు మంచి గ్రోత్ సాధించారని తెలిపారు. చెర్రీ గారి వల్ల రెండు పార్టులు చేశానని చెప్పారు. కూబా దిల్ రుబా.. ఆయన లేకుండా ఒక్క ఫ్రేమ్‌ కూడా ఊహించలేనని ప్రశంసించారు. మూవీ ఎడిట్‌ చేస్తున్నప్పుడు శ్రీవల్లి క్లోజప్స్‌ చూసి అలా ఉండిపోతున్నానని చెప్పారు.

తను ఎప్పుడూ చాలా మంచి ఎక్స్ప్రెషన్స్‌ ఇస్తుందని తెలిపారు. తన జీవితంలోకి ఎవరైనా వచ్చారంటే అది ఎప్పుడూ సాగుతూనే ఉంటుందని, దేవిశ్రీ కూడా అలాగేనని చెప్పారు. క్లైమాక్స్‌ కు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ ఇచ్చారని కొనియాడారు. శ్రీలీల అమేజింగ్ మూవ్స్ ఇచ్చారని తెలిపారు. తమ టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారని చెప్పారు.