గ్లోబల్ స్టార్ కోసం ఆ సెంటిమెంట్ ను వదిలేస్తున్న సుకుమార్
సంచలన సినిమాల డైరెక్టర్ సుకుమార్ కు ఓ స్పెషాలిటీ ఉంది. తన సినిమాల్లో హీరో పక్కన ఒక్క హీరోయిన్నే చూపిస్తాడు.
By: Tupaki Desk | 18 Feb 2025 6:05 AM GMTసంచలన సినిమాల డైరెక్టర్ సుకుమార్ కు ఓ స్పెషాలిటీ ఉంది. తన సినిమాల్లో హీరో పక్కన ఒక్క హీరోయిన్నే చూపిస్తాడు. ఇంకా చెప్పాలంటే ఇద్దరు హీరోలకు ఒక్క హీరోయిన్నే తీసుకుంటాడు. అంతేకాదు, తాను ఇప్పటివరకు చేసిన ఏ సినిమాలోనూ సుకుమార్ ఆల్రెడీ వర్క్ చేసిన హీరోయిన్ తో మళ్లీ వర్క్ చేయలేదు.
పుష్ప సినిమా విషయం వేరు. ఎందుకంటే పుష్ప కథను ముందుగా ఒకే సినిమాగా రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ నిడివి ఎక్కువ అవడంతో పుష్ప2 కూడా చేయాల్సి వచ్చిందని సుకుమార్ ఆల్రెడీ చెప్పాడు. కాబట్టి పుష్ప1, పుష్ప2లో రష్మిక నటించింది కదా అనే అవకాశం లేదిక్కడ. అది మొత్తం ఒకే కథ కాబట్టి ఆ కథలో రష్మికనే కనిపించింది.
అల్లు అర్జున్ తో కలిసి పుష్ప2 తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్, ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించాడు. పుష్ప2తో సుకుమార్ రేంజ్ ఇంటర్నేషనల్ లెవెల్ లోకి వెళ్లింది. పుష్ప2 తర్వాత సుకుమార్ తన తర్వాతి సినిమాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయనున్నాడనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ మూవీ కోసం సుకుమార్ ఇప్పటివరకు తాను పాటిస్తున్న హీరోయిన్ సెంటిమెంట్ ను పక్కనపెట్టబోతున్నాడని తెలుస్తోంది. రామ్ చరణ్ తో సుకుమార్ చేయబోయే పాన్ ఇండియా మూవీ కోసం హీరోయిన్ గా పుష్ప హీరోయిన్ అయిన రష్మిక మందన్నాని తీసుకోవాలని సుకుమార్ ఆలోచిస్తున్నాడట.
ఆయనకు హీరోయిన్ ను రిపీట్ చేయడం ఇష్టం లేకపోయినా పుష్ప1, పుష్ప2లో రష్మిక నటనకు ఫిదా అయిన సుకుమార్, రామ్ చరణ్ కోసం తన సెంటిమెంట్ ను పక్కనపెట్టి మరీ రష్మికను తీసుకోవాలనుకుంటున్నాడట. దానికి తోడు రష్మిక కు కూడా ఎలాగూ నేషనల్ వైడ్‌గా మంచి గుర్తింపు ఉంది కాబట్టి ఆమె ఈ సినిమాలో నటిస్తే సినిమాకు కూడా ప్లస్ అవుతుంది. ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.