Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన బిగ్ డైరెక్టర్

అయితే ఈ సినిమా స్టార్ట్ కావడానికి మరో ఏడాది సమయం పెట్టొచ్చని అనుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   22 Dec 2024 6:43 AM GMT
గేమ్ చేంజర్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన బిగ్ డైరెక్టర్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' ప్రీరిలీజ్ ఈవెంట్ యూఎస్ లో డల్లాస్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి డైరెక్టర్ సుకుమార్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. 'పుష్ప 2'తో సూపర్ సక్సెస్ అందుకొని మంచి జోరు మీద ఉన్న సుకుమార్ నెక్స్ట్ రామ్ చరణ్ తో మూవీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. 'RC 17' వర్కింగ్ తో తో సుకుమార్ చరణ్ మూవీ తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా స్టార్ట్ కావడానికి మరో ఏడాది సమయం పెట్టొచ్చని అనుకుంటున్నారు.

ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో 'RC 16' మూవీ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ కంప్లీట్ చేసిన 'గేమ్ చేంజర్' రిలీజ్ సందడి ఇప్పుడు నడుస్తోంది. 2025 సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్ డల్లాస్ లో నిర్వహించారు.

ఏ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరైన సుకుమార్ 'గేమ్ చేంజర్' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ఈ సినిమాని చూసాను. ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. ఇక సెకండ్ హాఫ్, క్లైమాక్స్ గూస్ బాంబ్స్ తెప్పించడం ఖాయం అని అన్నారు. మూవీ క్లైమాక్స్ లో అయితే రామ్ చరణ్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేశారని కొనియాడారు.

కచ్చితంగా ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరిని ఈ మూవీ ఎంటర్టైన్ చేస్తుందని కామెంట్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సినిమాపైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. 'ఇండియన్ 2' లాంటి డిజాస్టర్ తర్వాత శంకర్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఫ్యాన్స్ కొంత టెన్షన్ పడుతున్నారు. అయితే సోషల్ డ్రామాని తెరపై ఆవిష్కరించడంలో శంకర్ ఎక్స్ పర్ట్. అతని సినిమాలలో 'జెంటిల్మన్', 'ఒకే ఒక్కడు' ఇప్పటికి ఎవర్ గ్రీన్ చిత్రాలుగా ఉన్నాయి.

వాటి తరహాలోనే 'గేమ్ చేంజర్' ఉంటుందని అనుకుంటున్నారు. ఈ చిత్రం లో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా, పొలిటికల్ లీడర్ గా రెండు భిన్నమైన పాత్రలు చేస్తున్నాడు. తండ్రీకొడుకులుగా ఈ క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి. ఎస్ జె సూర్య ఈ చిత్రంలో విలన్ గా నటించాడు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా చేశారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.