Begin typing your search above and press return to search.

మా నాన్న సూపర్ హీరో… సుకుమార్ ఫిదా

ఇందులో తండ్రి కొడుకుల అనుబంధాన్ని సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   28 Sep 2024 7:45 AM GMT
మా నాన్న సూపర్ హీరో… సుకుమార్ ఫిదా
X

నవ దళపతి సుధీర్ బాబు హీరోగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీపైన ఇంటరెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. వి సెల్యులాయిడ్, CAM ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రీసెంట్ గా మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇందులో తండ్రి కొడుకుల అనుబంధాన్ని సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది.


ఎమోషనల్ డ్రామాతో ఈ మూవీ కథాంశం ఉండబోతోంది. అక్టోబర్ 11న దసరా కానుకగా ‘మా నాన్న సూపర్ హీరో’ రిలీజ్ కాబోతోంది. కచ్చితంగా ఈ మూవీతో సుధీర్ బాబు సక్సెస్ అందుకుంటాడనే మాట వినిపిస్తోంది. సుధీర్ బాబు ఈ చిత్రాన్ని గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సుధీర్ బాబు డైరెక్టర్ సుకుమార్ తో జరిగిన వాట్సాప్ సంభాషణకి సంబందించిన స్క్రీన్ షాట్స్ ని ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.

ఇందులో టీజర్ లో సుదీర్ బాబు ఎక్స్ ప్రెషన్ షాట్ ని సుకుమార్ వాట్సాప్ లో పెట్టారు. ఇందులో నీ ఎక్స్ ప్రెషన్ చాలా అద్భుతంగా ఉందని ఎమోజీలు పెట్టారు. మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని సుకుమార్ వాట్సాప్ మెసేజ్ పెట్టారు. తరువాత లవ్ ఎమోజీలని కూడా సుకుమార్ షేర్ చేశారు. సుధీర్ బాబు సుకుమార్ కి వాట్సాప్ లో రిప్లయ్ ఇచ్చారు.

థాంక్యూ సర్… ఇది నేను ఇప్పటి వరకు అందుకున్న బెస్ట్ కంప్లిమెంట్. మీ డీపీలో నాన్న గారి ఫోటో ఉంది. అంటే మీరు అతన్ని బాగా ప్రేమిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా మీలా తండ్రిని సూపర్ హీరోగా ప్రేమించే ఒక కుర్రాడి కథ అని సుధీర్ బాబు సుకుమార్ కి రిప్లయ్ ఇచ్చారు. ఆ వాట్సాప్ స్క్రీన్ షాట్ ని సుధీర్ బాబు ట్విట్టర్ లో షేర్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది.

సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ నుంచి అభినందనలు అందుకోవడం గొప్ప విషయం అని నెటిజన్లు సుధీర్ బాబుని కొనియాడుతున్నారు. అలాగే సుధీర్ బాబు పెర్ఫార్మెన్స్ పరంగా చాలా ఇంప్రూవ్ అయ్యారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.